Health Benefits : పచ్చి బఠాణీలు తింటే ఆ రోగాలు దరిచేరవ్.. ఎందుకు తినాలో తెలిస్తే షాక్
Health Benefits : పచ్చి బఠాణిలు ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. తినడానికి రుచికరంగా ఉంటూ ఫైబర్ అధికంగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఇవి శీతాకాలంలో బఠాణీలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. బఠాణీలను వెజ్ బిర్యానీ, ఆలూ కుర్మా, పన్నీర్ మటర్ మసాలా వంటివే కాకుండా ఇతర వంటకాలలో విరివిగా వాడుతుంటారు. రెగ్యూలర్ గా పచ్చిబఠానీలను ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. బఠాణీల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావలసిన పోషకాలను అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.పచ్చిబఠాణీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫినోల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు, విటమిన్ ఏ, సీ, పుష్కలంగా ఉంటాయి.
పచ్చి బఠాణీలు అల్జీమర్స్, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్టియోపోరోసిస్, క్యాండిడా వంటి రోగాలకు అద్బుతంగా పనిచేస్తాయి. అలాగే డయాబెటిస్ రోగులకు పచ్చి బఠాణీలు హెల్తీ ఫుడ్ గా చెప్పవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. అలాగే ఫైబర్ పుష్కలంగా ఉండటంతో జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది. జీర్ణ సమస్యలు, మలబద్దకం సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీఇన్ ప్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.అలాగే పచ్చిబఠాణీల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే క్యాల్షియం, పాస్ఫరస్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
పోషకాహార లోపం కారణంగా బలహీనంగా ఉన్న పిల్లలకు, స్త్రీలకు పచ్చి బఠాణీలను అద్బుత ఔషదంగా పనిచేస్తుంది. ఇవి ఉడికించి తీసుకుంటే ఎదుగుదల కావలసిన పోషకాలను అందించి రక్త హీనతను దూరం చేస్తాయి. అలాగే బఠాణీలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. కంటి శుక్లాలు దెబ్బతినకుండా కాపాడతాయి.పచ్చిబఠాణీలు క్యాన్సర్ తో పోరాడే ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. రోజు ఒక కప్పు పచ్చి బఠాణీలను తీసుకుంటే క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికడతాయి. అలాగే ఇవి రెగ్యూలర్ ఆహారంలో భాగం చేసుకుంటే గుండెకు మేలు చేస్తాయి. హార్ట్ డిసీస్, స్ట్రోక్ లు వచ్చే ప్రమాదాలను తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారికి పచ్చి బఠాణీలు మంచి డైట్ గా ఉపయోగపడతాయి.