Health Benefits : ఫ్యాటీ లివ‌ర్ తో భాద‌ప‌డితే ఇవి త‌ప్ప‌క తీసుకోండి.. ఇది అస్స‌లు తీసుకోకండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఫ్యాటీ లివ‌ర్ తో భాద‌ప‌డితే ఇవి త‌ప్ప‌క తీసుకోండి.. ఇది అస్స‌లు తీసుకోకండి

 Authored By mallesh | The Telugu News | Updated on :19 April 2022,1:00 pm

Health Benefits : ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు పెరిగిపోతున్నారు. ఇది అంత తేలికగా తీసుకునే విషయమైతే కాదు. దీని వల్ల భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు ఎదుర‌వుతాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోతే.. ఆ ప్రాంతంలో వాపు వస్తుంది. కణాలు దెబ్బ తింటాయి. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. మన శరీరంలో కాలేయం పని తీరుకు చాలా ప్రాముఖ్యం ఉంది. శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాలన్నింటినీ బయటకు పంపడంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఒక్కోసారి కాలేయంలో కొవ్వు శాతం కాస్త పెరుగుతుంది. దీన్ని ఫ్యాటీ లివర్‌ అంటారు.

మనం రోజూ తీసుకునే ఆహారాన్ని కాలేయం ప్రోటీన్ గా మార్చుతుంది.మన బాడీలో లివర్ రెండో పెద్ద ఆర్గాన్. మనం తీసుకునే ఫుడ్ లో ఏవైనా హాని కారకాలు ఉంటే వాటిని తొలగిస్తుంది లివర్. లివర్ కొంత మేర కొవ్వుతో కూడుకుని ఉంటుంది. అయితే బాడీలోని కొన్ని అవయవాల నుంచి కూడా కాలేయానికి కొవ్వు వెళ్తూ ఉంటుంది. దీంతో కాలేయంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. లివర్ ఫ్యాటీ లివర్ గా మారితే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. కొవ్వు పెరిగేకొద్ది కాలేయం సక్రమంగా పని చేయలేదు.

Health Benefits fatty liver non alcoholic fatty liver disease

Health Benefits fatty liver non alcoholic fatty liver disease

Health Benefits : ఆల్కహాల్ మానేయాలి..

ఇక మద్యపానం ఎక్కువగా చేసేవారు ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ బారిన పడతారు. అలాగే ఇంకొందరు మద్యపానం అలవాటు లేకపోయినా కూడా ఫ్యాటీ లివర్ బారిన పడతారు. సాధారణంగా ఫ్యాట్ ఎక్కువగా ఉండడం, షుగర్ తో బాధపడేవారు ఇలాంటి వ్యాధుల బారిన పడుతుంటారు. అంతేకాదు స‌న్న‌గా ఉన్నవారిలో కూడా కొన్ని సందర్భాల్లో ఫ్యాటీ లివర్ బారిన పడుతుంటారు.

Health Benefits : వ్యాయామం త‌ప్ప‌నిస‌రి..

తరుచూ ఎక్సర్ సైజ్ లు చేయాలి. తాజాగా ఉండేవాటిని ఆహారంగా తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలనే తినాలి. మధుమేహం అదుపులో ఉండేలా చూసుకోవాలి. కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే కూడా ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది.బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. గ్రీన్ టీ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా,

కొవ్వు కాలేయాన్ని నివారించడానికి కూడా ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి శరీర కొవ్వును తగ్గించడానికి మరియు కొలెస్ట్రాల్ ను తగ్గించటానికి సహాయపడతాయి. ఆహారానికి రుచిని పెంచడంతోపాటు.. వెల్లుల్లి శరీర కొవ్వు తగ్గడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాలేయంలో అధిక కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి.

Health Benefits : ఆకుకూర‌లు ఎక్కువ‌గా తీసుకోవాలి..

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన వాల్‌నట్స్ కాలేయ ఆరోగ్యానికి మంచివి. ఇది కాలేయానికి మంచిది మాత్రమే కాదు, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.
ఆకు కూరలు కాలేయ కొవ్వును తగ్గించడానికి, శరీర బరువు తగ్గడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ఆకు కూరలను ఆహారంలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. సోయా ఉత్పత్తుల్లో కొవ్వు తక్కువగా ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా కాలేయం ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది