Health Benefits : ఈ ఆకు కూరని తీసుకున్నారంటే… జీవితంలో డాక్టర్ అవసరం రానే రాదు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఈ ఆకు కూరని తీసుకున్నారంటే… జీవితంలో డాక్టర్ అవసరం రానే రాదు…?

 Authored By ramu | The Telugu News | Updated on :17 March 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Health Benefits : ఈ ఆకు కూరని తీసుకున్నారంటే... జీవితంలో డాక్టర్ అవసరం రానే రాదు...?

Health Benefits : ప్రస్తుత జీవన శైలిలో ఆహారపు అలవాట్లు ఎంతో ముఖ్యం. ప్రతిరోజు ఆకుపచ్చని ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. ఆకుకూర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.ఆకు కూరలలో తోటకూర, పాలకూర, బచ్చలి కూర, చుక్కకూర, మెంతికూర… ఇలా అన్ని ఆకుకూరలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అలాంటి ఆకుకూరకి చెందినదే “గంటగరాకు ” చాలా సాధారణమైన మొక్క. ఏ ఆకు కూర ఇవ్వని ప్రయోజనాలను ఈ గంటగరాకు ఇస్తుంది. ఈ ఆకు కూరలో విటమిన్లు, ఖనిజాలు, ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పోషకాలు అనంతం అని చెప్పవచ్చు.

Health Benefits ఈ ఆకు కూరని తీసుకున్నారంటే జీవితంలో డాక్టర్ అవసరం రానే రాదు

Health Benefits : ఈ ఆకు కూరని తీసుకున్నారంటే… జీవితంలో డాక్టర్ అవసరం రానే రాదు…?

Health Benefits ఈ ఆకుకూరలో పోషకాలు

ఈ గంటగరాకులో విటమిన్ ఎ, విటమిన్ సి, బి -కాంప్లెక్స్ విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఇంకా ఐరన్ వంటి ఖనిజాలు కూడా అధికంగా లభిస్తాయి. మొక్కలలో ఆధారిత ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మంచి మూలం. ఈ గంటగరాకులో బీటా కెరోటిన్లు, గ్లూటాతీయోన్, బీటాలైన్స్ వంటి శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నాయి.

గంటగరాకు ఆరోగ్య ప్రయోజనాలు : ఆకులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. చక్కర స్థాయిలో నియంత్రించుట కూడా ఈ ఆకు ఉపకరిస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గించగలదు. ఇందులో విటమిన్ ఎ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ సి, ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పైబర్ కలిగి ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తక్కువ కేలరీలు, అధిక ఫైబరు ఉండటం చేత, బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.

గంటగరాకు ఉపయోగించే విధానాలు : ఈ గంటగరాకు ఆకు కూరగా వండుకొని తినవచ్చు. ఈ గంటగరాకు ఆకులను సలాడ్లలో ఉపయోగించవచ్చు. ఈ ఆకులను జ్యూస్ లా కూడా తీసుకోవచ్చు. గంటగరాకు సూపులలో కూడా ఉపయోగించవచ్చు. అయితే, కొంతమందికి ఈ ఆకు ఎలర్జీ ప్రతి చర్యలను కలిగించే అవకాశం ఉంది. కిడ్నీలలో రాళ్లు ఉన్నవారు కూడా గంటగరాకు ఎక్కువగా తీసుకోవడం మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది