Health Benefits : మీ ఎముకలు ఉక్కులా ఉండాలంటే… వీటిని తినండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : మీ ఎముకలు ఉక్కులా ఉండాలంటే… వీటిని తినండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :20 May 2025,9:00 am

Health Benefits  : మీ ఎముకలు ఆరోగ్యంగా , ఉక్కులాగా దృఢంగా ఉండాలంటే, వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి. రక్తప్రసరణ సరిగ్గా జరగాలంటే,తప్పనిసరిగా వీటినీ తినాలి. మెదడు ఆరోగ్యంగా ఉండడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఇందులో ఉంటాయి.మీ ఎముకలు ఉక్కులా, ఆరోగ్యంగా ఉండటానికి ఇదొక్కటే మార్గమని పేర్కొంటున్నారు. ఎముకలను దృఢంగా మార్చే ఆహారం ఏమిటో తెలుసుకుందాం…

Health Benefits మీ ఎముకలు ఉక్కులా ఉండాలంటే వీటిని తినండి

Health Benefits : మీ ఎముకలు ఉక్కులా ఉండాలంటే… వీటిని తినండి…?

ఎముకలను దృఢంగా ఉంచడానికి రొయ్యలు మంచి ఆహారం. గర్భిణీ స్త్రీలు కూడా రొయ్యలని తినవచ్చు. ఈ రొయ్యలలో ఐరన్, అయోడిన్ ఉండుటచేత ఇది శరీరానికి ముఖ్యమైన పోషకం. ఇది థైరాయిడ్ హార్మోన్స్ రావాలంటే పెంచుతుంది. ఈ హార్మోను శిశువు మెదడును అభివృద్ధి చేస్తుంది. ఈ విధానంలో శుభ్రతను పాటించాలి. బాగా ఉడక పెట్టాలి. అప్పుడే వీటిని తినడం సులభం. రొయ్యలు పెంపకానికి వర్షాకాలంలో అత్యంత అనుకూల సమయం. ఎందుకంటే రొయ్య పిల్లలు ఎక్కువగా ఏ కాలంలోనే ఏర్పడతాయి. కాబట్టి, ఈ కాలంలో తీసుకునే రొయ్యలు నాణ్యతగా ఉండాలి. కొనుగోలు చేసే ముందు చూసుకోవాలి, ఉపయోగించే ముందు నల్ల సిరను శుభ్రం చేయాలి. రొయ్యల లో సన్నని నల్ల సిరను తొలగించకపోతే జీర్ణ క్రియ దెబ్బతింటుంది. పేగుళ్ళో ఇబ్బందులు వస్తాయి. అలర్జీలు రావచ్చు, శ్వాస ఆడకపోవచ్చు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు. అందుకే బాగా శుభ్రం చేసి తీసుకోవాల్సి ఉంటుంది.

రొయ్యలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కానీ కొలెస్ట్రాల్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. గుండె సమస్యలు ఉన్నవారు దీన్ని తినడం మానాలి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారం. కార్బొ హైడ్రేట్లు లేకపోవడం వల్ల ఇది లైట్ ఫుడ్ గా ఉపయోగపడుతుంది. రొయ్యలలో ఆస్ట్రాక్స్ తీన్ అనే పదార్థం ఉంటుంది. కావున జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మెదడులోని కణాలు బలపడతాయి. మెదడులో ఏర్పడిన వాపు తగ్గుతుంది. హేపారిన్ అనే పదార్థం దృష్టి నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది. రొయ్యలలో ఉండే జింక్,జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. చర్మం కొత్త కణాలను ఏర్పరుస్తుంది. జుట్టు రాలిపోవడం పెరుగుదల ఆగిపోవడం వంటి సమస్యలకు రొయ్యలు చక్కటి పరిష్కారం. చర్మనీ ప్రకాశవంతంగా ఉంచుతుంది.

ఐరన్ పుష్కలంగా ఉండడంతో రక్తహీనత సమస్యలు ఉన్నవారు తినవచ్చు. ఇది శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. కండరాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది. కండరాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది. హిమోగ్లోబిన్ పనితీరు మెరుగుపడుతుంది. రొయ్యల్లో ప్రోటీన్, క్యాల్షియం పొటాషియం విటమిన్లతో పాటు ఎముకలు బలంగా తయారవుతుంది. కెరోటినాయీడ్లు అనే రకాల క్యాన్సర్లను నివారించగలవు. సెలినీయం అని అరుదైన ఖనిజం,ఊపిరితిత్తుల క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. రొయ్యలు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంగా చెప్పవచ్చు. రొయ్యలు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం అని చెప్పవచ్చు. సరైన శుభ్రత, సమయానుసారంగా,రొయ్యలను ఆహారంలో చేర్చుకుంటే అన్ని వయసుల వారికి ప్రయోజనం కరముగా ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది