Health Benefits : ఈ అరుదైన మొక్క కనిపిస్తే అస్సలే దిలిపెట్టొద్దు.. వెంట తెచ్చుకోండి! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఈ అరుదైన మొక్క కనిపిస్తే అస్సలే దిలిపెట్టొద్దు.. వెంట తెచ్చుకోండి!

Health Benefits : అనేక మొక్కలను పిచ్చి మొక్కలుగా భావించి పట్టించుకోము కానీ అలాంటి మొక్కల్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. ఒకసారి ఆ గుణాల గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. ఇప్పుడు చెప్పబోయే ఎర్ర కుసుము లేదా కుసుమ అనబడే ఈ మొక్క ఆకులు ముళ్ళలా పదునుగా ఉంటాయి. ఈ మొక్కను ఆర్జిమోన్ మెక్సికానా, మెక్సికన్ గసగసాలు, ఎల్లో ఆస్టైల్, మెక్సికన్ ప్రిక్లెపాపీ, ప్రేక్షీ గసగసాలు, అమాపోలాస్ డెల్ కాంపో, బెర్ముడా […]

 Authored By pavan | The Telugu News | Updated on :6 April 2022,3:00 pm

Health Benefits : అనేక మొక్కలను పిచ్చి మొక్కలుగా భావించి పట్టించుకోము కానీ అలాంటి మొక్కల్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. ఒకసారి ఆ గుణాల గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. ఇప్పుడు చెప్పబోయే ఎర్ర కుసుము లేదా కుసుమ అనబడే ఈ మొక్క ఆకులు ముళ్ళలా పదునుగా ఉంటాయి. ఈ మొక్కను ఆర్జిమోన్ మెక్సికానా, మెక్సికన్ గసగసాలు, ఎల్లో ఆస్టైల్, మెక్సికన్ ప్రిక్లెపాపీ, ప్రేక్షీ గసగసాలు, అమాపోలాస్ డెల్ కాంపో, బెర్ముడా తిస్టిల్, బ్రహ్మదంతి, కారువాంచో, గాంబోగే ఆస్టిల్ మరియు పుష్పించే ఆస్టిల్ అంటారు.ఈ పిచ్చి కుసుమ మొక్కలో మత్తుమందు, యాంటీ బాక్టీరియల్, క్యాన్సర్ నిరోధక, యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. మరియు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ మొక్కలో ఉంటాయి.

ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్క విరిగితే పసుపు రంగు పాలు బయటకు వస్తాయి. ఎక్కడైనా గాయమయితే ఈ పసుపు పాలను అక్కడ వేయాలి. ఈ మొక్కలు విత్తన సారం లార్విసైడ్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది దోమ వికర్షకంగా పనిచేస్తుంది. ఈ ఎర్రు కుసుమ మొక్కల ఆకులతో చేసే రసం దోమలు రాకుండా కూడా చేస్తుంది. అంటే మస్కిటో రిపెల్లెంట్ గా చాలా చక్కగా పని చేస్తుంది ఈ ఎర్ర కుసుమతో చేసే రసం. ఈ మొక్కల ఆకులను తీసుకుని కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా నూరుకోవాలి. ఆ తర్వాత దానిని ఒక వస్త్రంలోకి తీసుకుని మొక్క యోక్క రసం మాత్రమే బయటకు తీసుకోవాలి. ఆ నీటి లాంటి ద్రవం చక్కటి మస్కిటో రిపెల్లెంట్ గా పని చేస్తుంది. దోమలు ఎక్కువగా కుడుతున్నప్పుడు.. ఈ రసాన్ని కాళ్లకు, చేతులకు రాసుకుంటే దోమల బారి నుండి తప్పించుకోవచ్చు.

health benefits in argemone mexicana brahmadandi plant uses

health benefits in argemone mexicana brahmadandi plant uses

ఈ పిచ్చి కుసుమ మొక్కల ఆకుల్లో నెమాటిసైడ్ లక్షణాలు కూడా కలిగి ఉంది. మెక్సికన్ గసగసాల ఆకులను నపుంసకత్వానికి చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ ఆకులను తరచూ తీసుకునే మగవారిలో ఆ శక్తి పెరుగుతుందని ఆయుర్వేద అధ్యయనాలు చెబుతున్నాయి. కణాలు బలహీనంగా ఉన్న వారు దీనిని తరచూ తీసుకోవాలి. అలాగే హార్మోన్ల కూడా విడుదల కావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కుసుమ మొక్కలతో చేసే ఆస్తమా చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ ఎర్ర కుసుమ మొక్కను హోమియోపతి మందుగా విరివిగా ఉపయోగిస్తారు. ఏవైన గాయాలు అయినప్పుడు ఈ మొక్క రసాన్ని గాయం తగిలిన చోట రాస్తే నొప్పి నుండి ఉపశమనం వస్తుంది. అలాగే గాయం కూడా త్వరగా నయం అవుతుంది. నిస్సారమైన పూతల, కుష్టురోగం, చర్మ వ్యాధులు, అపానవాయువు. మలబద్ధకం, రుమటాల్జియా మరియు కోలిక్ కోసం ఈ నూనెను ఉపయోగిస్తారు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది