Health Benefits : ఈ ఆకులతో విషపురుగులు కాటేస్తే విరుగుడు.. ఈ మొక్క ఇళ్లముందు ఉంటే అంతా మంచే..
Health Benefits : గడ్డి గులాబీలు లేదా టేబుల్ రోజ మొక్కలు సాధారణంగా అందం కోసమే పెంచుతారని చాలా మందికి తెలసు. కానీ ఈ మొక్కలతో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. కాగా ఈ మొక్కలు నేలపై సాధారణంగా వెడల్పుగా 20 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి, వీటి కొమ్మలు చాలా మృదువుగా వాలిపోయే లక్షణాలు ఉంటాయి. అందుకే ఎక్కువ ఎత్తు పెరగలేవు. ఈ మొక్క ఆకులు చాలా చిన్నవిగా ప్రత్యేకంగా అందంగా మృదువుగా ఉంటాయి. ఈ టేబుల్ రోజ్ మొక్కలు ఇంటి ఆవరణాల్లో, పలు ఆఫీస్ లలో ఎక్కువగా కనిపిస్తూ అందంగా ఉంటాయి. దీనిని పూలకుండీ లేదా ఖాళీ స్థలంలో పెంచుకోవచ్చు. గడ్డి గులాబీలు అనేక రకాలున్నాయి.
ఇవి ఒక్కొక్క రకం ఒక్కొక్క రంగు పువ్వులను పూస్తుంది. వీటిని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పెంచుకుంటారు. ఇళ్లముందు అందంగా పెంచుకుంటారు.గడ్డి గులాబీ మొక్కలు హెపటైటిస్, అసిటిస్‌తో కాలేయం యొక్క సిర్రోసిస్, ఫారింక్స్‌లో వాపు మరియు నొప్పి చికిత్సలో ఔషదంగా ఉపయోగిస్తారు. అలాగే ఆకులు, కాండం రసాన్ని పాము, కీటకాలు కాటేసినప్పుడు ఔషదంగా వాడతారు. అలాగే కాలిన గాయాలు, పొట్టు, తామర వంటి సమస్యలు ఈ మొక్కల ఆకులను పూయడం ద్వారా తగ్గిపోతాయి.గులాబీలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అద్భుతంగా ఉంటాయి.
అలాగే టేబుల్ రోజ్ మొక్కల ఆకులు, పువ్వులు మెత్తగా పెస్ట్ లా తయారు చేసుకుని మొహంపై ఉన్న మొటిమలపై రాయాలి. తర్వాత శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి. అలాగే చర్మం కాంతివంతంగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది తామర మరియు సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులను కూడా నయం చేస్తుంది.అలాగే జుట్టు అందంగా మెరిసిపోవాలంటే ఈ ఆకులను, ఈ మొక్క కాండాన్ని మిక్సి లో వాటర్ తో వేసి పెస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి ఆలివ్ ఆయిల్, కొకోనట్ అయిల్ మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. 30నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది.