Health Benefits : ఈ ఆకు ఒక్కటి చాలు ఆరోగ్యంగా ఉండాలంటే… వెంటనే తెచ్చుకోండి
Helth Benefits: మానవ శరీరం కొన్నికోట్ల కణాల సముదాయం. ఈ కణాలు ఆరోగ్యంగా ఉంటే ఏ జబ్బులు దరిచేరవు. కణాలు పాడవకుండా ఉండాలంటే.. ఆరోగ్యంగా ఉండాలంటే యాంటిఆక్సిడెంట్స్ కావాలి. కాణాలు శుభ్రం చేసుకోవడానికి, రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి, కణాల పెరుగుదలకు యాంటిఆక్సిడెంట్స్ అద్బుతంగా పనిచేస్తాయి. అందుకే యాంటిఆక్సిడెంట్స్ తగ్గిపోకుండా చూసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలి. మునగాకు యాంటిఆక్సిడెంట్స్ శరీరంలో ఆక్టివేట్ చేయడానికి మునగ ఆకు అద్బుత ఔషదంగా పనిచేస్తుంది.ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి మునగాకును ఉపయోగిస్తారు. మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.
క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏ పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌లో మునగాకును వాడతారు. మునగ ఆకు కూడా ఆరోగ్యానికి మరింత మంచిది. ఇది కాలేయంలో చేరిన విష పధార్థాలను బయటికి పంపిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది.మునగాకు, కాడలు అనగానే ఎక్కువగా చాలా మంది శృం.. సమస్యలను మాత్రమే దూరం చేసేందుకు అనుకుంటారు. కానీ, వీటిని వాడడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పచ్చిగానే కాదు వీటిని పొడి చేసి కూడా చాలా రకాలు ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి.
Health Benefits in powder top of drumstick leaves
ఈ ఆకులతో తయారుచేసిన టీ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. మోరింగా టీ అని పిలిచే ఈ డ్రింక్‌తో కిడ్నీల్లో రాళ్ల సమస్య తగ్గి కొవ్వు కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు. మునగాకును పౌడర్స్‌గా చేసి టీ, కాఫీలు చేస్తున్నారు. అందుకే మోరింగా లక్షణాల గురించి ప్రతీ ఒక్కరికీ తెలియజేస్తున్నారు.. వీటిని విరివిగా వాడాలని చెబుతున్నారు.తాజా మునగ ఆకులను తెచ్చుకోండి. వాటిని చక్కగా ఎండలో ఆరబెట్టండి , ఆపై పౌడర్ లా చేసుకొని దీని టీ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసుకోడానికి మీకు సమయం లేదనిపిస్తే..మీరు ఆకులని కూడా శుభ్రం చేసి, కొన్ని నిమిషాల పాటు వాటిని నీటిలో ఉడకబెట్టి మోరింగా టీ తయారు చేసుకోవచ్చు. ఇన్ని లాభాలున్న మునగాకులని మీ డైట్‌లో చేర్చుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి.