Health Benefits : ఈ ఆకులు తింటే ఆ సమర్థ్యం పెరుగుతుంది.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు.. ఎక్కడ కనిపించినా వదలకండి ఈ మొక్కని..
Health Benefits : రెడ్డి వారి నాను బాలు ఈ పేరు వినే ఉంటారు. ఈ మొక్క ఎక్కువగా పల్లెటూర్లలో ఇంటి ముందు మట్టిలో, పొలాల్లో, మట్టి గోడలపై, నీటి కాల్వల పక్కన, గట్లపైనా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే దీన్ని కలుపు మొక్కగా భావించి మనం తొలగించేస్తాం.. కానీ ఈ మొక్క ఆయుర్వేద పరంగా చేసే మేలు అంతా ఇంత కాదు.ఈ మొక్క శాస్త్రీయ నామం ఐపోర్బియా హిర్టా పిలుస్తారు. దీనిని పాలకాడ, నాగార్జుని, పచ్చబొట్లాకు, నానపాల అని కూడా అంటారు. సంస్కృతంలో దుగ్ధికా, హిందీలో దుగ్ధి అని కూడా అంటారు. ఆయుర్వేదం వంటి సాంప్రదాయక వైద్య విధానాల్లో ఈ మొక్కను ఆస్థమా వంటి శ్వాసకోశపు వ్యాధులకు, స్త్రీల ఆరోగ్య సమస్యలకు, ఉదరకోశపు వ్యాధులకు నివారణగా వాడతారు.
సన్నని కాండం గల వార్షికపు మొక్క. మొక్క అంతటా సన్న నూగు ఉంటుంది. ఆకులు కాండానికి ఇరువైపులా ఉంటాయి. మొక్క నుండి స్రవించే పాల లాంటి ద్రవంలో ఉన్న ఆల్కలాయిడ్లు, టర్పినాయిడ్లు మొదలైన పదార్ధాల వల్ల ఇది పశుగ్రాసంగా పనికిరాదు. సాధారణంగా ఇది కలుపు మొక్కగా పెరుగుతుంటుంది.ఈ మొక్క అనేక కంటి సమస్యలను తొలగించి దృష్టిని పెంచడంలో తోడ్పడుతుంది. అలాగే శృం.. సార్థ్యాన్ని పెంచి సంతానానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్క స్త్రీ, పురుషులకు యవ్వనంగా కనపడటానికి, శరీరంలో ఏర్పడే కణతులు, గడ్డలను కరిగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆకులను దంచి రసంతీసి పూర్వకాలంలో పచ్చబొట్లు వేయడానికి వాడేవారంట.
ఈ ఆకుల కషాయాన్ని మొతాదులో తీసుకుంటే మదుమేహం, కఫం వల్ల వచ్చే రోగాలు, పేగులలో పుట్టే పురుగులు, బాక్టీరియా సంబంధిత రోగాలు, గొంతు సంబందిత రోగాలు, చర్మవాధ్యులు, కంటి సమస్యలను తొలగిస్తుంది. ఈ ఆకులను పప్పులో వేసుకుని తింటే బాలింతలకు పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ మొక్కను బాగా ఎండ బెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు భోజనానికి అరగంట ముందు గ్లాసు వేడి నీటిలో ఈ పొడి కలుపుకుని తాగాలి. దీనివల్ల మదుమేహం కంట్రోల్ అవుతుంది.