Health Benefits : ఈ మూడింటిని తీసుకుంటే చాలు.. అధిక బరువుకి చెక్ …
Health Benefits : ఎవరైనా బరువు తగ్గడం గురించి మాట్లాడినప్పుడల్లా మొదట చేప్పేది వ్యాయామం అనే మాట. అనేక మంది ఫిట్‌నెస్ ఔత్సాహికులు పెరుగుతున్నందుకు ప్రతిరోజూ కొత్త వర్కవుట్ విధానాలు వెలువడుతున్నాయి. వ్యాయామం అనేది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియలలో ఒకటి. దీనికి చాలా శక్తి, సమయం పడుతుంది. కుర్రాళ్లు దీన్ని సులభంగా ప్రాక్టీస్ చేయగలిగినప్పటికీ, ఆఫీసులకు వెళ్లేవారు అలసిపోయిన తర్వాత పరిగెత్తడం, దూకడం, బరువులు ఎత్తడం కష్టం. జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గించుకునే మార్గాలను ఇప్పుడు చూద్దాం..కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల ఔషధ గుణాల ఉన్నాయి. అందువల్ల కరివేపాకును కేవలం వంటల్లోనే కాకుండా..
వివిధ ఔషదాల్లోని ఉపయోగిస్తారు. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కాలేయానికి రక్షణ కల్పిస్తాయి. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి బరువు తగ్గిస్తుంది. జుట్టు సమస్యలను నివారించేందకు కరివేపాకు ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. అజీర్తి, ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది. కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది.లవంగము అనేది ఒక చెట్టు మొగ్గ. లవంగం చెట్టు నుండి పూసిన పువ్వును ఎండబెట్టి దీనిని తయారు చేస్తారు. ఒక ప్రత్యేకమైన సుగంధద్రవ్యంగా ఇది అన్నిరకాల వంటకాల్లోనూ ఉపయోగించబడుతుంది.
Health Benefits : బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి….
దీనిలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలూ, యాంటిబయోటిక్ గుణాలు ఉంటాయి. లవంగాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ యొక్క మందం పెంచుతుంది, ఇది కడుపు లైనింగ్ ను రక్షిస్తుంది మరియు సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలు లో ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది మరియు మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. దీంతో కూడా అధిక బరువు నుంచి విముక్తి పొందవచ్చు.అధిక బరువు తగ్గించడానికి నిమ్మకాయ కూడా ఉపయోగపడుతుంది. నిమ్మరసం మరియు తేనే కలిపి తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. లెమన్ ఉపయోగించడం వల్ల తొందరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఇందుల విటామిన్ సీ ఉండి చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది.