Health Benefits : 15 రోజుల్లోనే ఎంతటి బరువునైనా తగ్గించే ఈ ఆకుల గురించి తెలుసా?
Health Benefits : స్టెవియా అనేది పచ్చని ఆకులతో కూడిన మూలికా మొక్కపేరు. ఇది దక్షిణ అమెరికాకు చెందింది. అయితే ఇది చాలా తియ్యగా ఉండటం వల్ల వందల సంవత్సరాలుగా ఆహారంలో ఉపయోగించబడుతోంది. స్టెవియా గ్లైకోసైడ్లు ప్రధానంగా స్టెవియోసైడ్, రెబాడియోసైడ్ దాని తీపికి కారణమయ్యే క్రియాశీల సమ్మేళనాలు. స్టెవియాను ఈ మధ్య చాలా మంది చక్కెరకు బదులుగా వాడుతున్నారు. అందుకే దీన్ని స్వీటెనర్ అని కూడా పిలుస్తారు. ఇది చక్కర కంటే 40 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటుంది. కానీ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావం చేయదు. ఇది శరీరంపై ప్రతికూల దుష్ప్రభావాలను కూడా కల్గి ఉండదు. సాధారణ చక్కెల వలే కాకుండా ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది.
మానవ శరీరంలోని రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి కల్గిన స్టెవియాపై అనేక రకాల ప్రయోగాలు జరిగాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు లేగా కార్బోహైడ్రేట్ నియంత్రిత ఆహారం తీసుకునే వ్యక్తులకు ఇది సాధారణ చక్కెరకు సరైన ప్రత్యామ్నాయం. ఎందుకంటే వారు మధుమేహ సమస్యల గురించి ఆందోళన చెందకుండా తీపి ఆహారాన్ని తీసుకోవచ్చు. స్టెవియాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే వీటిని కేకులు, కుకీలు, క్యాండీల తయారీల్లో ఎక్కువగా వాడుతున్నారు. స్టెవియాలో గ్లైకోసైడ్ లు ఉన్నాయి. ఇవి నిజానికి రక్తనాళాలను సడలించగలవు. మూత్ర విసర్జనను పెంచుతాయి. అలాగే శరీరం నుండి సోడియాన్ని తొలగించడానికి సులభతరం చేయగలవు.
దీనర్థం హృదయనాళ వ్యవస్థపై తక్కువ ఒత్తిడి ఉంటుంది. అలాగే రక్తపోటు, గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అంతే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సాయపడవచ్చు. చర్మ సంరక్షణను మెరుగుపరచడంలో సాయపడతాయి. బోలు ఎముకల వ్యాధిని నిరోధిస్తుంది. స్టెవియాలో యాంటీ డయేరియా, యాంటీ హైపర్ గ్లైసీమిక్, యాంటీ హైపెర్టెన్సివ్, డైయూరిటిక్, యాంటీ ఇనఫ్లమేటరీ యాంటీ డయోరియా చర్యలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ ఆకులు ఆన్ లైన్ లో కూడా దొరుకుతాయి. అయితే వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల 15 రోజుల్లోనే బరువు తగ్గొచ్చు. అందుకే అధిక బరువు, గుండె సమస్యలు, రక్తపోటు, మధుమేహం ఉన్నవారు ఈ ఆకులను ప్రతిరోజూ ఆహారంలో తీస్కోండి.