Ajwain Water : రాత్రి పడుకునే ముందు వామును తీసుకుంటే… మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా…!!
Ajwain Water : వాము. ఈ విత్తనాలను చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ దీనిలో ఎన్నో పోషకాలు మరియు ఔషధ గుణాలు చాలా ఉన్నాయి అని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మన రోజు వారి ఎదుర్కొనే సమస్యలకు ఈ వాముతో ఈజీగా చెక్ పెట్టొచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి పడుకునే టైంలో వామును తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి అని అంటున్నారు. దీనికోసం వామును మెత్తని పౌడర్ గా చేసుకొని […]
ప్రధానాంశాలు:
Ajwain Water : రాత్రి పడుకునే ముందు వామును తీసుకుంటే... మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా...!!
Ajwain Water : వాము. ఈ విత్తనాలను చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ దీనిలో ఎన్నో పోషకాలు మరియు ఔషధ గుణాలు చాలా ఉన్నాయి అని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మన రోజు వారి ఎదుర్కొనే సమస్యలకు ఈ వాముతో ఈజీగా చెక్ పెట్టొచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి పడుకునే టైంలో వామును తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి అని అంటున్నారు. దీనికోసం వామును మెత్తని పౌడర్ గా చేసుకొని నిల్వ చేసుకోవాలి. అయితే పంటి నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఒక అర టీ స్పూన్ వాము పౌడర్ మరియు కొద్దిగా ఆలీవ్ ఆయిల్ ను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే పంటి నొప్పి అనేది ఈజీగా తగ్గిపోతుంది. అంతేకాక నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది…
గోరువెచ్చని నీటిలో వాము పౌడర్ ను కలిపి తీసుకోవడం వలన నెలసరి టైం లో మహిళలు ఎదుర్కొనే తిమ్మిర్లు మరియు కడుపు నొప్పి సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే పొత్తికడుపు నొప్పి కూడా తొందరగా తగ్గుతుంది. ఇలా నిత్యం కచ్చితంగా వాము వాటర్ తాగుతూ ఉన్నట్లయితే బరువు కూడా ఈజీగా తగ్గుతారు. దీనికోసం వాముపొడి లేకుంటే వాముని నేరుగా కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ వాములో యాంటీ బ్యాక్టీరియాల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే శ్వాసకోశ వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ మీకు జలుబు మరియు దగ్గు, కఫం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, ఈ నీటిని తీసుకుంటే అవి తొందరగా తగ్గుముఖం పడతాయి…
రాత్రి పడుకునే ముందు ఇలా గోరువెచ్చని వీటిలో వాము పౌడర్ ని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తొందరగా దూరమవుతాయి. సాధారణంగా కడుపు ఉబ్బరం మరియు జీర్ణ సమస్యలను తగ్గించటంలో కూడా ఈ వాము వాటర్ చాలా బాగా పనిచేస్తాయి. అలాగే ఈ వామును కప్పు నర నీటిలో వేసి ఒక కప్పు అయ్యే వరకు ఆ నీటిని బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని కనుక మీరు ఫిల్టర్ చేసి ప్రతిరోజు తీసుకుంటే తొందరగా బరువు తగ్గుతారు. అలాగే పిల్లలకు అరుగుదల సరిగ్గా లేకున్నా లేక పెద్దలు గ్యాస్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వాము వారికి ఔషధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వాముతో జీర్ణ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.