Health Benefits : ఉసిరి మురబ్బా… పరిగడుపున తినబ్బా…
Health Benefits : ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఈ ఉసిరిలో ఉంటుంది. దీనిని ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు. అలాగే ఉసిరిని కార్తీక మాసంలో వనభోజనాల సందడి ఉసిరి చెట్టు నీడను ప్రారంభం కావాలి అని మన పూర్వీకులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే చాలా మంచిదట. దీనికి కారణం ఉసిరి చెట్లు గాలి చాలా మంచిదని […]
Health Benefits : ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఈ ఉసిరిలో ఉంటుంది. దీనిని ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు. అలాగే ఉసిరిని కార్తీక మాసంలో వనభోజనాల సందడి ఉసిరి చెట్టు నీడను ప్రారంభం కావాలి అని మన పూర్వీకులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే చాలా మంచిదట. దీనికి కారణం ఉసిరి చెట్లు గాలి చాలా మంచిదని కనుగొన్నారు. ఉసిరికాయలు ఉండే పోషకాలు ఎన్నో సమస్యల నుంచి కాపాడుతాయి. అదే సమయంలో ఉసిరి నుంచి తయారైన మురబ్బా కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.
ఉసిరికాయ మురబ్బాను ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఒక ఉసిరికాయ మురబ్బా తినడం వలన అనేక వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. ఉసిరి మురబ్బా రుచిలో కూడా చాలా బాగుంటుంది. దీనిని పిల్లలకు, వృద్ధులకు కూడా సులభంగా ఇవ్వవచ్చు. అయితే రెగ్యులర్గా ఉసిరికాయ మురబ్బా తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఉసిరికాయ మురబ్బా చర్మానికి చాలా మేలు చేస్తుంది. రోజు పరిగడుపున ఒకటి తినడం వలన చర్మంపై మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. ఉసిరిలో విటమిన్ ఇ, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి. ఇది వృద్ధాప్యం సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాదు ముఖంలో గ్లో కూడా పెరుగుతుంది.
ఉసిరికాయ మురబ్బా బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఉసిరిలో అమినో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి తీసుకుంటే బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అలాగే ఉసిరి మురబ్బా గుండె రోగులకు చాలా మేలు చేస్తుంది. ఉసిరి మురబ్బా తినడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిని రోజు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.