Health Benefits : ఈ ఆకులు నమిలితే నిమిషాల్లో షుగర్ లెవల్స్ కంట్రోల్.. ఇది ఎక్కడ కనిపించినా వదలకండి
Health Benefits : ఈరోజుల్లో ఎంతో మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్.. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిలో ఈ సమస్య పెరుగుతోంది. వ్యాయమాలు చేయకపోవడం, గంటల తరబడి కూర్చోవడం, సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫ్రైలు, కొవ్వు ఉండే పదార్థాలు, నిల్వ ఉండే పచ్చళ్లు, స్వీట్స్, కొన్ని రకాల వైరస్, ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల అసమతుల్యత వల్ల డయాబెటిస్ అటాక్ చేస్తుంది.
ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
అలాగే రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తూ శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. అలాగే మరికొన్ని సహజ పద్దతుల్లో బయాబెటిస్ ను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..అరుగులా ఆకుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. డయాబెటిస్‌తో పోరాడే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ ఆకులను ఎలా తీసుకోవాలో చాలామందికి తెలియదు. ఎలా తీసుకోవాలో ఇప్పడు చూద్దాం. అరుగులా ఆకులు సువాసనలు వెదజల్లుతాయి. ఈ ఆకులను డైరెక్ట్ గా తినవచ్చు. లేదా వండుకుని కూడా ఆహారంగా తీసుకోవచ్చు.

health benefits of arugula leaves in your diabetes control
ఆకులరసాన్ని తీసి తాగితే డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది. అలాగే ఆకులను నమిలి తిన్నా మంచి ప్రయోజనం ఉంటుంది.అరుగులా ఆకుల్లో విటమిన్లు ఏ, బీ9, సీ, ఐరన్, మెగ్నీషియం, అయోడిన్, కాల్షియం మరియు పొటాషియం ఉంటుంది. అరుగులా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. అరుగుల ఆకులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అరుగులాలో వివిధ ఖనిజాలు మరియు పోషకాలు చాలా ఉన్నాయి. ఈ ఆకులను జ్యూస్ తయరు చేసుకుని కూడా తాగితే డయాబెటిస్ రోగులకు మంచి ఫలితం ఉంటుంది.