Gunugu Puvvulu : గునుగు పువ్వులను చూసి పనికిరాని పూలు అనుకుంటున్నారా? వాటిలోని ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు?
Gunugu Puvvulu : గునుగు పువ్వులు తెలుసు కదా. ఈ పువ్వులను మనం సాధారణంగా పట్టించుకోం. కేవలం బతుకమ్మ పండుగ వచ్చినప్పుడే ఈ పులను పట్టించుకుంటాం. అప్పుడే ఈ పుల కోసం ఎగబడతాం. మిగితా సమయాల్లో ఈ పువ్వులను, వాటి చెట్లను అస్సలు చూడనే చూడం. అయితే.. బతుకమ్మను పేర్చడానికి గునుగు పూలనే ప్రత్యేకంగా తీసుకుంటున్నారంటే.. ఈ పువ్వులలో ఏదో ఒక విశిష్టత ఉండి ఉండాలి. ఖచ్చితంగా ఈ పువ్వులలో విశిష్టత ఉంది కానీ.. అది మనకు తెలియదు.
ఏదో అందరూ వాడుతున్నారు కాబట్టి మనమూ వాడేస్తున్నాం. అయితే.. గునుగు పువ్వులను కేవలం.. బతుకమ్మ పువ్వుల కోసమే కాకుండా… వాటిని ఆయుర్వేదంగా చూడొచ్చు. ఈ పువ్వులలో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. వీటి వాసన పీల్చినా చాలు.. ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. అందుకే.. వీటిని బతుకమ్మ కోసం తీసుకొచ్చి పేర్చుతుంటారు.
Gunugu Puvvulu : గునుగు మొక్క ఆకులను వండుకొని కూడా తినొచ్చు
అవును.. గునుగు పువ్వులు ఎంత గొప్పవో.. వాటి ఆకులు కూడా అంతే గొప్ప గుణాలను కలిగి ఉంటాయి. ఈ మొక్క ఆకులను ఒకప్పుడు మన ముత్తాతలు.. కూరగా వండుకొని తినేవారట. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కలో చాలా విటమిన్స్ ఉంటాయి. మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే… గునుగు పువ్వు లేత ఆకులను కూరగా వండుకొని తింటారు.
ఈ మొక్క ఆకులు యాంటీ బ్యాక్టీరియా, యాంటీ డయాబెటిక్, యాంటీ మైక్రోబయల్ గుణాలను కలిగి ఉంటాయి. అందుకే.. ఈ మొక్క ఆకులను ఎక్కువగా ఆయుర్వేద మందులలోనూ ఉపయోగిస్తారు. ఈ ఆకులను రుబ్బి.. పేస్ట్ గా చేసి.. శరీరం మీద గాయాలు అయితే పెట్టుకోవచ్చు. చర్మ సమస్యలలు ఉన్నవాళ్ల కూడా ఈ ఆకు పేస్ట్ ను పెట్టుకోవచ్చు. మలబద్ధకం సమస్య ఉన్నా.. రక్త హీనత ఉన్నా.. హైబీపీ ఉన్నా.. ఇలా ఎన్నో రకాల వ్యాధులకు ఒకే ఒక్క ఔషధం.. గునుగు ఆకులు. ఇప్పటికీ.. మారుమూల ప్రాంతాల్లో ఈ చెట్టు ఆకులను వండుకొని తింటుంటారు.