Health Benefits : కాకరకాయ చేదుగా ఉంటుందని దూరం పెడుతున్నారా… ఈ ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు…
Health Benefits : కాకరకాయ అంటే చాలామంది ఇష్టపడరు.. కానీ కొంతమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది మన ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప పదార్థం కాకరకాయ. దీనివలన ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగాలు అంతా ఇంతా కాదు.. శరీరంలో వచ్చే వివిధ రకాల వ్యాధులను తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది ఈ కాకరకాయ. సహజంగా బ్లెడ్లోయూరిక్ యాసిడ్ అనేది చెడు పదార్థం. ఆహార పదార్థాల్లోని ప్యూరిన్ అనే కెమికల్ విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ తయారవుతుంది. ఇది కిడ్నీలో పనితీరును సమర్థవంతం చేస్తుంది. శరీరంలో ఏర్పడిన చెడు పదార్థాలను మూత్ర రూపంలో బయటికి పంపిస్తుంది. యూరిక్ యాసిడ్ శరీరంలో ఉండిపోతే ఎన్నో రకాల చెడు ప్రభావాలు కలుగుతాయి. డయాబెటిస్ అధిక బరువు లాంటి ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది.
అదేవిధంగా కీళ్లనొప్పితో ఇబ్బంది, కీళ్ల పగుళ్లు, వాపు లాంటి గుణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సహజంగా మహిళల్లో యూరిక్ యాస్ 2.4, సl6.0 ఎంజీ వరకు యూరిక్ యాసిడ్ , మగవారిలో 3.4,7.0 ఎం.జి వరకు ఉంటే ఎలాంటి డేంజర్ ఉండదు. అయితే దానికి మించి పెరిగితే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
అయితే సరైన పోషకాహారం తింటే జీవన శైలి విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ బాధ నుండి తప్పించుకోవచ్చు. ప్యూరిన్ అధికంగా ఉండే క్యాబేజీ , బెల్ పెప్పర్, బీన్స్, దుంపలు, వంకాయ లాంటివి అస్సలు ముట్టకూడదు. వీటికి బదులుగా కాకరకాయను తీసుకోవాలి.
ఈ కాకరకాయ యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాకరకాయలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కాకరకాయలో పిండి పదార్థాలు నాలుగు గ్రాములు, క్యాలరీలు 20 గ్రాములు, విటమిన్ సి 93% ఉంటాయి. ఈ కాకరకాయను ఎక్కువగా తీసుకుంటే చాలా ఆరోగ్య లాభాలు కలుగుతాయి. అదేవిధంగా బ్లడ్ లో చక్కెర లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం నుండి రక్షిస్తుంది. అలాగే కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. అధిక బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.