Health Benefits : 2 లవంగాలతో ఊహించని ప్రయోజనాలు… అవి ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : 2 లవంగాలతో ఊహించని ప్రయోజనాలు… అవి ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…

 Authored By anusha | The Telugu News | Updated on :8 July 2022,3:00 pm

Health Benefit : లవంగము ఒక సుగంధ ద్రవ్యము. అలాగే ఒక మసాలా దినుసు కూడా. లవంగాలను రుచి కోసం వివిధ రకాల కూరల్లో వేసుకునే ఒక రకమైన పోపు దినుసు. వీటిలో వాసనే కాదు, విలువైన పోషకాలు కూడా ఉంటాయి. లవంగాలలో కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ యాసిడ్, మాంగనీస్, విటమిన్ ఎ,సి ఉంటాయి. అలాగే వైద్య పరంగా లవంగాలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వర్షాకాలంలో అందరినీ ఎక్కువగా బాధించే సమస్యలు దగ్గు, జలుబు.
వీటినుంచి ఉపశమనం పొందాలంటే ప్రతి రోజు ఉదయాన్నే టీ లో శొంఠికి బదులుగా లవంగాలను వేసి తాగితే మంచిది. అలాగే తలనొప్పి తో బాధపడుతున్న వారు పాలలో కొద్దిగా లవంగం పొడిని, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి నుదుటి మీద రాసుకుంటే తలనొప్పి త్వరగా తగ్గుతుంది. ఇంకా ఈ లవంగాలతో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం అల్పాహారం తీసుకునే అరగంట ముందు తాగాలి. ఇలా నానబెట్టుకున్న లవంగం నీళ్లు లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. జీర్ణక్రియ ప్రక్రియలో బాగా జరిగేలా చేస్తుంది. దీనివలన గ్యాస్ సంబంధిత సమస్యలు నుంచి తప్పించుకోవచ్చు. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వారు ప్రతి రోజు ఉదయాన్నే ఈ లవంగాలు నీళ్లలో వేసుకొని తాగారంటే సులువుగా బరువు తగ్గుతారు. ఈ నీళ్లు శరీరంలో ఉన్న అనవసరపు కొవ్వును కరిగిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. ప్రతిరోజు లవంగాల నీళ్లను తాగితే రక్తంలో ఇన్సులిన్ స్థాయి పెరిగి చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అలాగే మూడు లీటర్ల నీళ్లలో నాలుగు గ్రాములు లవంగాలు వేసి నీళ్లు సగం అయ్యేవరకు మరిగించి తాగితే కలరా విరోచనాలు తగ్గుతాయి. అంతే కాకుండా ఒక కప్పు నీళ్లలో ఆరు లవంగాలను వేసి డికాషన్ లాగా చేసుకుని దానిలో ఒక స్పూన్ తేనే కలిపి రోజుకు మూడుసార్లు తాగితే ఉబ్బసం తగ్గుతుంది.

Health Benefits of cloves

Health Benefits of cloves

అలాగే లవంగాలను పొడిగా చేసుకొని దంతాలను రుద్దితే బ్యాక్టీరియా తొలగిపోయి, నోరు శుభ్రంగా ఉంటుంది. అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు నానబెట్టుకున్న రెండు లవంగాల నీళ్లను తాగితే గుండెల్లో నొప్పి మరియు ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడే వారికి ఈ నీళ్లు మంచి ఉపశమనం కలిగిస్తుంది. లవంగాలలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు వలన ఇన్ఫెక్షన్లు రావు. పంటి నొప్పితో బాధపడే వారు ఒక లవంగాన్ని తీసుకొని నొప్పి ఉన్న పన్నుమీద పెట్టుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు లవంగాలను వేయించి పొడిగా చేసుకుని దానిలో కొద్దిగా తేనె వేసి బాగా కలిపి తీసుకుంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే లవంగాలను ఎక్కువగా తీసుకోకూడదు. దీనివలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా పరిమితిగా తింటే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది