Dates : ఖర్జూరాలను నెయ్యిలో కూడా నానపెట్టుకొని తినొచ్చు… ఎలాగంటే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dates : ఖర్జూరాలను నెయ్యిలో కూడా నానపెట్టుకొని తినొచ్చు… ఎలాగంటే…?

 Authored By ramu | The Telugu News | Updated on :4 October 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Dates : ఖర్జూరాలను నెయ్యిలో కూడా నానపెట్టుకొని తినొచ్చు... ఎలాగంటే...?

Dates : ప్రస్తుత కాలంలో చాలామంది తమ ఆహారంలో డైట్స్ ను భాగం చేసుకుంటున్నారు. వీటిల్లో ఖర్జూరాలు కూడా ఒకటి. అయితే ఈ ఖర్జూరాలను నెయ్యిలో నానబెట్టుకొని తింటే చాలా మంచి ఫలితం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ ఖర్జూరాలలో సహజ చక్కెర,నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు అనేవి ఉంటాయి. కావున ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మంచి ఎనర్జీ బూస్ట్ లభిస్తుంది అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ ఖర్జూరాలలో ఉండే గ్లూకోజ్ మరియు ప్రక్టోజ్,సుక్రోజ్ లాంటి సహజ చెక్కర్లు శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. అలాగే ఈ చక్కెరలు ఈజీగా జీర్ణం అవుతాయి. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసే శక్తి కూడా ఉన్నది…

నెయ్యిలో నానబెట్టినటువంటి ఖర్జూరాలను తినడం వలన రోగనిరోధక శక్తి ఎంతో పెరుగుతుంది అని నిపుణులు అంటున్నారు. అంతేకాక మన శరీరంలో నశించిన కణజాలలాను తిరిగి రిపేర్ చేస్తుంది అని అంటున్నారు. అంతేకాక ఖర్జూరం మరియు నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రించడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలను తీసుకుంటే మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా చెప్పాలంటే గర్భిణీలు వీటిని తినడం వలన గర్భాశయం ఆరోగ్యంగా మరియు ఎంతో మృదువుగా తయారవుతుంది. దీని ఫలితంగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…

Dates ఖర్జూరాలను నెయ్యిలో కూడా నానపెట్టుకొని తినొచ్చు ఎలాగంటే

Dates : ఖర్జూరాలను నెయ్యిలో కూడా నానపెట్టుకొని తినొచ్చు… ఎలాగంటే…?

నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవటం వలన ఒత్తిడి మరియు ఆందోళన, గుండె దడ లాంటి సమస్యల నివారణకు కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలాగే ఎముకలు బలంగా ఉండడానికి మరియు గుండె ఆరోగ్యానికి కూడా ఇవి చక్కగా పనిచేస్తాయి. అయితే నెయ్యిలో ఖర్జూరాలను ఎలా నానబెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 10 నుండి 12 ఖర్జూరాలను విత్తనాలు లేకుండా తీసుకోవాలి. వాటిని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దీనిలో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అది కొద్దిగా వేడి అయిన తర్వాత దానిలో ఖర్జూరాలు వేసి సన్నని మంటపై కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఖర్జూరాలను కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత వీటిని నెయ్యితో సహా గాలి చొరబడని గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి..

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది