Sprouted Moong : మొలకెత్తిన పెసర్లను అల్పాహారంలో భాగం చేసుకుంటే చాలు… జీవితంలో ఈ సమస్యలు రావు…!!
ప్రధానాంశాలు:
Sprouted Moong : మొలకెత్తిన పెసర్లను అల్పాహారంలో భాగం చేసుకుంటే చాలు... జీవితంలో ఈ సమస్యలు రావు...!!
Sprouted Moong : మన వంట గదిలో ఎన్నో రకాల పప్పు దినుసులు ఉంటాయి. వాటిలలో ఒకటి పెసర్లు. అయితే ఈ పెసర్లు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే సాధారణ పెసర్ల కంటే మొలకెత్తిన పెసర్లు మన ఆరోగ్యానికి మరింతగా మేలు చేస్తాయి. ఇవి బరువును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే మొలకెత్తిన పెసర్లలో ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయి. అయితే ఈ మొలకెత్తిన పెసర్లను నిత్యం ఖచ్చితంగా అల్పాహారంలో భాగం చేసుకోవడం వలన ఎన్నో రకాల వ్యాధుల నుండి ఈజీగా బయటపడవచ్చు. అయితే మొలకెత్తిన పెసర్లు తీసుకోవడం వలన కలిగే లాభాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మొలకెత్తిన పెసర్లలో ప్రోటీన్లు అనేవి అధిక మోతాదులో ఉంటాయి. అలాగే వీటిలో ఉండే ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు ఈజీగా జీర్ణం అవుతాయి. అంతేకాక ఈ మొలకేత్తిన గింజలను తీసుకోవడం వలన గుండెమంట మరియు గ్యాస్ లాంటి సమస్యలు కూడా నయం అవుతాయి. అలాగే మొలకెత్తిన పెసర్లు తీసుకోవడం వలన జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగుపడుతుంది. అలాగే ఇవి జీర్ణ ఎంజైమ్ ల స్రావాని కూడా పెంచుతుంది అని జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ మొలకలు అనేవి బరువును నియంత్రించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉండే మొలకలను తీసుకోవడం వలన జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. అలాగే ఇది ఘట్ ఆరోగ్యాని కి కూడా మేలు చేస్తుంది. ఈ మొలకెత్తిన పెసర్లలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అంతేకాక మొలకెత్తిన పెసర్ల ను తీసుకోవడం వలన రక్తపోటు మరియు గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ లాంటి ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది