Diabetes : డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఆకుపచ్చ బాదం.! ఎప్పుడు, ఎలా, ఎన్ని తినాలో తెలుసుకోండి!!
Diabetes : ఈ మధ్యకాలంలో చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. జీవన విధానంలో మార్పులు, పనిలో ఒత్తిడి, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం ఇలా పలు కారణాల వలన షుగర్ వ్యాధి వస్తుంది. ఈ సమస్య మొదలైందంటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. దీనిని నియంత్రించకపోతే శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఒత్తిడికి దూరంగా ఉండాలి. బాడీని ఆక్టివ్ గా ఉంచుకోవాలి. ఆహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన చక్కెర నియంత్రణలో ఉంటుంది. పొడిబాదం చక్కెరను నియంత్రణలో ఎలా ఉంచుతుందో, తడి బాదం కూడా చక్కెరను నియంత్రించడంలో ప్రభావంతంగా ఉంటుందని రుజువు అయింది.
తడి బాదం అని కూడా పిలవబడే ఆకుపచ్చ బాదంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఆంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తాయి. ఆకుపచ్చ బాదం రక్తంలో చక్కెరను నియంత్రించి చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పచ్చి బాదాం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన శరీరంలో టాక్సీన్ తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇది షుగర్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. బాదంపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఫైబర్ ఆహార జీర్ణ క్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రేగులను బలోపేతం చేస్తాయి.
బాదంపప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన చక్కెర నియంత్రణలో ఉంటుంది. పచ్చి బాదంపప్పును తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ అసిడిటీ, మలబద్ధకం సమస్యలు ఉన్నవారు బాదంపప్పును తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉండే ఈ బాదంపప్పును తీసుకోవడం వలన ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. పచ్చి బాదంపప్పు తీసుకుంటే గుండె జబ్బులు రావు. బాదంపప్పులో ఉండే బయోప్లెవనైట్స్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బాదంపప్పులో విటమిన్ ఇ, యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన చర్మం మెరుగుపడుతుంది. బాదం వృద్ధాప్యం ఫ్రీరాడికల్స్ తో పోరాడటానికి సహకరిస్తుంది.