Guava Leaves : ఈ ఆకులు డయాబెటిస్ తో పాటు ఈ సమస్యలకు దివ్య ఔషధం…!!
ప్రధానాంశాలు:
Guava Leaves : ఈ ఆకులు డయాబెటిస్ తో పాటు ఈ సమస్యలకు దివ్య ఔషధం...!!
Guava Leaves : ప్రస్తుత కాలంలో మనల్ని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలలో జామకాయ కూడా ఒకటి. ఇది రుచిగా ఉండటంతో పాటుగా ఎన్నో రకాల సమస్యలను కూడా దూరం చేస్తుంది. వీటిలో ఉండే పోషకాలు మరియు విటమిన్లు అనేవి మన ఆరోగ్యాన్ని రక్షించడంలో హెల్ప్ చేస్తాయి. అయితే జామకాయ మాత్రమే కాదు దాని యొక్క ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. అయితే ఈ జామ ఆకులు అనేవి పలు రకాల సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిలో ముఖ్యంగా ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీ ఫైనల్స్ లాంటివి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే ఈ ఆకులను డైరెక్ట్ గా నమిలి తీసుకోవచ్చు లేక ఈ ఆకులతో డికాషన్ తయారు చేసుకొని కూడా తాగొచ్చు. అయితే ఈ జామ ఆకులనేవి ఎటువంటి వ్యాధులను తగ్గిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
రక్తంలో చక్కెర నియంత్రణ : ఈ జామ ఆకులు అనేవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటంలో హెల్ప్ చేస్తాయి. అయితే దీనిలో ఉండే పోషకాలు అనేవి చక్కెర స్థాయిని పెరగకుండా చేస్తాయి. అంతేకాక ఆహారం నుండి కార్బోహైడ్రేట్ ల శోషణను తగ్గించడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది…
చర్మం – జుట్టు ఆరోగ్యానికి మేలు : జామ ఆకులతో డికాషన్ తయారు చేసుకొని తాగడం వలన చర్మం మరియు జుట్టు సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే దీనిలో విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మం మరియు జుట్టు ఆకృతిని మెరుగుపరచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది…
గుండె జబ్బులను తగ్గిస్తుంది : జామ ఆకుల నీటిని తాగటం వలన కూడా శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల అనేది తగ్గుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే గుండె సమస్యలను తగ్గించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది…
రోగనిరోధక శక్తిని పెంచుతుంది : మీరు శరీరంలో రోగా నిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే జామ ఆకుల నీటిని తాగాలి. దీనిలో విటమిన్ సి అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుంది.
జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది : జీర్ణ సమస్యలను నయం చేసేందుకు జామ ఆకుల కషాయం చాలా బాగా పని చేస్తుంది. ఇది ఫైబర్ కు మంచి మూలం అని చెప్పొచ్చు. అలాగే ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అలాగే అజీర్తి మరియు మలబద్ధకం, విరోచనాలు, కడుపుఉబ్బరం లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది…
జామ ఆకుల డికాషన్ : జామ ఆకుల నీళ్లను తయారు చేసే ముందు ఒక గిన్నెలో ఒక గ్లాసు నీరు మరియు కొన్ని జామ ఆకులను వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టుకొని చల్లారిన తర్వాత తాగాలి