Guava Leaves : పరిగడుపున ఈ ఆకులను తింటే ఏమవుతుందో తెలుసా… ఈ రకపు వ్యాధులకు చెక్ పెట్టొచ్చంట…!
ప్రధానాంశాలు:
Guava Leaves : పరిగడుపున ఈ ఆకులను తింటే ఏమవుతుందో తెలుసా... ఈ రకపు వ్యాధులకు చెక్ పెట్టొచ్చంట...!
Guava Leaves : పరగడుపున జామ ఆకులను తరచూ తీసుకోవడం వలన తగ్గించుకోవచ్చు. శరీరంలో భారీగా పెరిగిపోయిన కొలెస్ట్రాలను, గించేందుకు ఈ జామ ఆకు రసం అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఎక్కువగా జామ పండ్లను ఎక్కువగా తింటూ ఉంటాం. కానీ జామ ఆకులని తినం. జామ పండే కాదు జామ ఆకు కూడా చాలా ఔషధ గుణాలను కలిగి ఉన్నది. పండులో ఎటువంటి అయితే ఔషధ గుణాలు ఉంటాయో జామ ఆకులో కూడా అలాంటి ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. జామ ఆకుల్లో ఫైబర్ తో పాటు విటమిన్ ఏ ‘సమృద్ధిగా లభిస్తుంది. అలాగే ఈ ఆకుల్లో విటమిన్ సి ‘పోలిక్ యాసిడ్,పొటాషియం,కాపర్, మాంగనీస్ కూడా అధికంగా లభిస్తాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ జామ ఆకును ఉదయాన్నే లేవగానే పరిగడుపున ఈ ఆకులను తింటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
జామ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులని పరిగడుపున తినడం వలన షుగర్ వ్యాధిని అరికట్టవచ్చు. ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలటం వల్ల జీర్ణ క్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణం మలబద్ధకం, గ్యాస్,అసిడిటీ మొదలైన మొదలైన ఉదర సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కావున ప్రతిరోజు ఉదయాన్నే జామ ఆకులను తినడం అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జామ ఆకుల్లో చాలా బయో ఆక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. శరీరంలోని మధుమేహం ను తగ్గించడమే కాక , అధిక స్థూలకాయత్వంను మరియు శరీరంలో భారీగా పేరుకపోయిన కొవ్వును కరిగించడంలోనూ ఈ జామ ఆకు రసం అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ జామ ఆకులను పరిగడుపున తినటం వలన క్యాన్సర్ కు దారి తీసే కణాలను నాశనం చేయవచ్చు.
క్యాన్సర్ కారక కణాల ఉత్పరివర్తనాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ జామ ఆకులను ప్రతిరోజు పరిగడుపున తరచూ తీసుకోవడం వలన క్యాన్సర్లను నివారించవచ్చని నిపుణులను చెబుతున్నారు. ఈ జామ ఆకుల్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులలో విటమిన్ సి ‘రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వలన రక్తపోటును అదుపులో ఉంచగలిగే సామర్థ్యమును కూడా కలిగి ఉంటుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుటకు ఎంతో సహాయపడుతుంది. జామ ఆకుల్లో ఉండే క్యాటేచిన్స్, గల్లీక్ ఆసిడ్, వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇది పరోక్షకంగా బరువు తగ్గటానికి ఎంతగానో సహాయపడుతుంది.