Health Benefits : ఒక ప్లేట్ ఇది తిన్నారంటే… శరీరానికి కావలసిన పోషకాలన్ని అందుతాయి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఒక ప్లేట్ ఇది తిన్నారంటే… శరీరానికి కావలసిన పోషకాలన్ని అందుతాయి…

Health Benefits : మనం శరీరం బలంగా ఉండాలని వివిధ ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి సరిగ్గా ఉండాలంటే ఆహారంలో అనేక పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అందులో ముఖ్యంగా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే మినరల్స్, విటమిన్స్. స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కొవ్వులు, ఫైబర్. ఇవన్నీ రోజు తినే ఆహారంలో కచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి వీటన్నింటిని కలిపి వండితే కిచిడి అవుతుంది. ఈ […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 September 2022,3:00 pm

Health Benefits : మనం శరీరం బలంగా ఉండాలని వివిధ ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి సరిగ్గా ఉండాలంటే ఆహారంలో అనేక పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అందులో ముఖ్యంగా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే మినరల్స్, విటమిన్స్. స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కొవ్వులు, ఫైబర్. ఇవన్నీ రోజు తినే ఆహారంలో కచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి వీటన్నింటిని కలిపి వండితే కిచిడి అవుతుంది. ఈ కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కొద్దిగా కొర్రలను తీసుకోవాలి. దీనిలో కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ ఉంటాయి. ఇవి బరువు పెరగకుండా చేస్తాయి. తర్వాత గుప్పెడు పెసరపప్పు తీసుకోవాలి. దీంతోపాటు పచ్చి బఠాణి తీసుకోవాలి.

సోయా చిక్కుడు నానబెట్టి వేసుకోవచ్చు. వీటితోపాటు స్వీట్ కార్న్ గింజలను కూడా వేసుకోవాలి. ఇందులో ప్రొటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్, ఉంటాయి. ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఉడకడానికి నీటికి బదులుగా నాలుగైదు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని వడకట్టుకొని జ్యూస్ లాగా తీసుకోవాలి. దీంతోపాటు తోటకూరగాని, పాలకూర గాని, చుక్కకూర గాని, గోంగూర గాని, బచ్చల కూరగాని ఏదో ఒక ఆకుకూర వేయాలి. సూక్ష్మ పోషకాల కోసం ఈ ఆకుకూరలు తీసుకోవాలి. వీటిలో ఐరన్, క్యాల్షియం, జింక్, ఫాస్పరస్ మొదలైనవి ఉంటాయి. దీంతోపాటు క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, చిలకడదుంప ముక్కలు కొన్ని వేసుకోవాలి.

Health Benefits of kichidi get weight loss

Health Benefits of kichidi get weight loss

అలాగే బీన్స్ ముక్కలు, క్యాప్సికం మొక్కలు వీటితోపాటు ఇంకేమైనా కూరగాయలను తీసుకోవచ్చు. కావలసిన పచ్చిమిరపకాయలు కూడా వేసి వీటన్నింటిని కుక్కర్లో పెట్టుకోవాలి. వీటిని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి తురుము గాని పైన చల్లుకోవాలి. కొద్దిగా మీగడవేసి తాలింపు పెట్టుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇందులో అవిసె గింజల కారం పొడి గాని వేరుశనగల కారంపొడిగా కలుపుకొని తినొచ్చు. ఇలా తింటే అన్నం వండుకోవాల్సిన అవసరం ఉండదు. కావాల్సిన పోషకాలాన్ని శరీరానికి అందుతాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది