Health Benefits : పరిగడుపున ఈ డ్రింక్ త్రాగండి చాలు… పొట్ట తగ్గి స్మార్ట్ గా అవుతారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : పరిగడుపున ఈ డ్రింక్ త్రాగండి చాలు… పొట్ట తగ్గి స్మార్ట్ గా అవుతారు…

 Authored By aruna | The Telugu News | Updated on :28 August 2022,6:30 am

Health Benefits : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవనశైలి విధానం చాలామంది అధిక బరువు, ఊబకాయం తో బాధపడుతున్నారు. దీనికి కారణాలు పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారం లో కొన్ని మార్పులు ఇలాంటి వాటి వలన ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఈ అధిక బరువు, ఊబకాయం ఉన్నవారిలో ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. గుండెకు కొలెస్ట్రాల్, కూడా పెరుగుతూ ఉంటుంది. అందువలన అందరూ స్ట్రాంగ్ గా, ఫిట్ గా ఉండేందుకు కొన్ని చిట్కాలను పాటిస్తున్నారు. అయితే తొందరగా అధిక బరువు తగ్గాలంటే.. అల్లం, నిమ్మ రసాన్ని ఆహారంలో యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం, నిమ్మకాయ ఉదరం చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ను తొందరగా కరిగిస్తుంది.

వీటిని నిత్యము తీసుకోవడం వలన ఎన్నో రకాల ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది. పరిగడుపున నిమ్మరసం అల్లం తీసుకోవడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మరసం అల్లం యొక్క లాభాలు : పొట్టచుట్టు కొవ్వుని కరిగిస్తుంది: పొట్ట చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ని నిమ్మరసం అల్లం తీసుకోవడం వలన తొందరగా కరిగిపోతుంది. వీటిలో విటమిన్ సి అనేక పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వలన ఊబకాయం తగ్గించడం లో చాలా బాగా ఉపయోగపడతాయి. శరీరాన్ని క్లీన్ చేస్తుంది : నిమ్మకాయ,అల్లం లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.

Health Benefits Of Lemon Juice And Ginger For Enlarged Stomach

Health Benefits Of Lemon Juice And Ginger For Enlarged Stomach

వీటిని నిత్యం తీసుకోవడం వలన శరీరాన్ని క్లీన్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ సి శరీరాన్ని డిటాక్స్ చేసి కొలస్ట్రాలను కరిగిస్తుంది. అలాగే దీన్ని తీసుకోవడం వలన బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా జరుగుతుంది.దీనికోసం అల్లం ముక్కలుగా కట్ చేసుకుని నీటిలో వేసి బాగా మరిగించి.. తర్వాత ఈ నీటిలో నిమ్మరసం కలుపుకొని నిత్యము రెండు మార్లు తీసుకోవచ్చు. దీనిలో కొంచెం తేన ను కూడా కలుపుకొని త్రాగవచ్చు. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే నిత్యము అల్లము నిమ్మరసాన్ని తీసుకోవాలి ఎందుకనగా దీనిలో ఉండే ఫైబర్ రకరకాల పోషకాలు జీర్ణ వ్యవస్థను వేగవంతం చేస్తాయి ఈ మిశ్రమం ఆహారాన్ని ఈజీగా జీర్ణం చేస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది