Dates : ఖర్జూరం లేక అత్తి పండు ఈ రెండిటిలో దేనిని పాలలో కలిపి తీసుకుంటే మంచిది… నిపుణులు ఏమంటున్నారంటే…??
Dates : వర్షాకాలం ముగిసిపోయింది ఇక మనం శీతాకాలంలోకి అడుగుపెడుతున్నాం. అయితే ఈ కాలంలో ప్రజలు తమ ఆహారపు విషయములో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే చలికాలంలో కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇవి శరీరాన్ని లోపల నుండి వెచ్చగా ఉండేలా చేయడంలో హెల్ప్ చేస్తాయి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు లాంటి ఎన్నో పోషకాలు […]
ప్రధానాంశాలు:
Dates : ఖర్జూరం లేక అత్తి పండు ఈ రెండిటిలో దేనిని పాలలో కలిపి తీసుకుంటే మంచిది... నిపుణులు ఏమంటున్నారంటే...??
Dates : వర్షాకాలం ముగిసిపోయింది ఇక మనం శీతాకాలంలోకి అడుగుపెడుతున్నాం. అయితే ఈ కాలంలో ప్రజలు తమ ఆహారపు విషయములో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే చలికాలంలో కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇవి శరీరాన్ని లోపల నుండి వెచ్చగా ఉండేలా చేయడంలో హెల్ప్ చేస్తాయి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అంతేకాక శరీరానికి సరిపోయే పోషకాహారాన్ని ఇవ్వడంతో పాటుగా శక్తిని కూడా ఇస్తాయి. అలాగే ఈ డ్రైఫ్రూట్స్ ను పాలతో కలిపి తీసుకోవడానికి కొంతమంది ఇష్టపడతారు అని ఢిల్లీలో ధర్మశీల నారాయణ ఆసుపత్రి యొక్క చీఫ్ డైటీషియన్ పాయల్ శర్మ చెప్పారు. అయితే చాలా మంది ఖర్జూరాలను మరియు అంజీర పండ్లను పాలలో వేసుకొని మరిగించి మరీ తాగుతూ ఉంటారు. అయితే ఈ రెండిటిలో ఎక్కువ శక్తివంతమైనది ఏది అని చాలా మంది అయోమయంలో ఉన్నారు. అందుకే ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
రెండు ఆరోగ్యకరమైన ఎంపికలు : ఖర్జూరం మరియు అత్తిపండ్లు రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లు అని డెటిషియన్ పాయల్ శర్మ తెలిపారు. అయితే వీటిని పాలలో కలుపుకొని తీసుకుంటే వాటి యొక్క ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. అలాగే ఈ అత్తి పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఎంతో ఆరోగ్యంగా ఉంచటంలో హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఖర్జూరంలో సహజ చక్కెర అనేది ఉంటుంది. ఇది తాజాదనం మరియు శక్తికి ముఖ్య మూలం…
ఎముకలు – చర్మం కోసం : ఖర్జూరాలు మరియు అత్తి పండ్లను పాలలో కలిపి తీసుకుంటే అది పోషక పానీయంగా మారుతుంది. ఇది ఎముకలకు ఎంతో హెల్ప్ చేస్తుంది. ఎందుకు అంటే పాలల్లో కాల్షియం మరియు అత్తి పండ్ల లో మెగ్నీషియం అనేది ఉంటుంది. ఇది చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే మెరుపును కూడా ఇస్తుంది…
అలసట దూరం అవుతుంది : ఖర్జూరాలు మరియు అత్తి పండ్లు కలిపిన పాలను తాగటం వలన అలసట నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఆ రోజంతా కూడా ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటుంది. అంతేకాక ఎవరైనా బరువు తగ్గాలి అని అనుకుంటే వారు అత్తి పండు లేక ఖర్జూరం కలిపిన పాలను తాగొచ్చు. ఇలా చేయడం వలన పొట్ట అనేది ఎక్కువ సేపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే అత్తిపండ్లు మరియు ఖర్జూరం కలిపిన పాలను తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పాలను తాగటం వలన మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు…