Health Benefits : సమ్మర్ లో ఇది తాగితే ఎంతో చల్లదనం.. ఒక్క గ్లాసు చాలు
Health Benefits : మనం ఏది తిన్నా జీర్ణాశయంలో జీర్ణం అవుతుంది. అందుకు అందులో ఊరే యాసిడే ప్రధాన కారణం. పొట్టలో ఊరే హైడ్రో క్లోరిక్ యాసిడ్ ఎంత పవర్ ఫుల్ అంటే.. అది బాత్రూములు క్లీన్ చేసేందుకు వాడే యాసిడ్ కంటే కూడా పవర్ ఫుల్ అయినది హైడ్రో క్లోరిక్ యాసిండ్. దీని 0.8 పీహెచ్ నుండి 1.2 పీహెచ్ కలిగి ఉంటుంది. జీర్ణాశయంలో ఊరే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్లే మనం ఏమి తిన్నా అరుగుతుంది. మరి ఇంత పవర్ ఉన్న యాసిడ్ పొట్టలో ఊరితే జీర్ణాశయానికి ఏమీ కాదా అనే ప్రశ్న తలెత్తవచ్చు. జీర్ణాశయానికి ఉండే గోడలకు ఉండే పొరలు ఈ యాసిడ్ ను తట్టుకుంటాయి.
అంత పవర్ కూడా తట్టుకుని పొట్టకు ఏమీ కాకుండాచూసుకుంటుంది.నిప్పుకు నీరు ఎలా విరుగుడో అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కు ఆల్కలీన్ విరుగుడు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ పొట్టలో ఎటువంటి డ్యామేజీ కలిగించకూడదు అంటే దానికి సరిపడినంత ఆల్కలీన్ విడుదల కావాల్సి ఉంటుంది. ఆల్కలీన్ ఎక్కువగా ఉండాలి అంటే పొఠాషియం, బైకార్బొనేట్ ఎక్కువగా ఉండాలి. ఈ 2 ఆల్కలీన్ నేచర్ ని పెంచుతాయి. పొటాషియం, బైకార్బొనేట్ ఎక్కువగా ఉండాలి అంటే సుగంధ బాగా ఉపయోగపడుతుంది. సుగంధలో హేర్పానోయిడ్స్, సాపోనిన్స్ ఎక్కువగా ఉంటాయి. సుగంధ తీసుకోవడం
వల్ల జీర్ణ రసాల్లోనూ, పొట్ట అంచుల్లోనూ కావాల్సిన పొటాషియం, బైకార్బోనేట్ అయాన్ను విడుదలల చేస్తాయి. సుగంధ తీసుకోవడం వల్ల పొట్ట అచుల్లో ఉండే జిగురు లైఫ్ ఎక్కువగా ఉండి యాసిడ్ దాడిని తట్టుకుంటుంది.పొట్ట జిగురు అంచుల్లో ఉండే లైకోనిన్ అనే ప్రోటీన్ రిలీజ్ చేయడం వల్ల పొట్ట అంచుల్లో జిరుగు పొరలు ఎక్కువ కాలం హెల్తీగా ఉండి యాసిడ్ దాడి నుండి తట్టుకోగలుగుతాయి. సుగంధ వల్ల ఆసిడిటీ, అల్సర్స్ వంటివి రావు. కార్బోహైడ్రేట్స్ జీర్ణం అయ్యేటప్పుడు మ్యూకస్ సెల్స్ పై దాడి జరగకుండా జిగురు పొరలను ఆరోగ్యంగా ఉంచడానికి సుగంధ చాలా బాగా ఉపయోగపడుతుంది.