Health Benefits : వేప మొక్కలో మీకు తెలియని కొన్ని విషయాలు.! ఎన్నో రకాల వ్యాధులకు చెక్.!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : వేప మొక్కలో మీకు తెలియని కొన్ని విషయాలు.! ఎన్నో రకాల వ్యాధులకు చెక్.!!

 Authored By aruna | The Telugu News | Updated on :5 August 2022,7:30 am

Health Benefits : సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్కలలో ఒకటి తల్లి లాంటి వేప మొక్క. ఈ మొక్కలో ఉన్న ప్రతి యొక్క భాగం ఎన్నో రకాల వ్యాధులను తగ్గించే గుణాలు దీనిలో ఉన్నాయి. అదేవిధంగా చాలామందికి తెలియని కొన్ని విషయాలు కూడా దీనిలో దాగి ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ అధికంగా ఉంటుంది. ఈ వేప పుల్లలను నిత్యము దంతాలను శుభ్రం చేసుకునే వారికి నోటి దుర్వాసన, దంతలా నుంచి రక్తం కారుట ఇలా దంత సమస్యలు ఎన్నో తగ్గుతాయి.

అదేవిధంగా దీని ఆకులను నిత్యము తిన్నట్లయితే షుగర్ వ్యాధి బాధితులకు షుగర్ ను కంట్రోల్లో ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీని బెరడును ముక్కలుగా చేసుకుని రెండు గ్లాసుల నీటిలో మరగబెట్టి వాటిని చల్లార్చి నిత్యము రెండు పూటలా సేవించడం వలన కాలేయం సమస్యలు, అలాగే పేగు పూత లాంటివి తగ్గుతాయి. అలాగే దీని వేప పూత తీసుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ వేయించి దానికి కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి చేర్చి దీనిని భోజనం చేసేటప్పుడు మొదట ముద్ద తో కలిపి తీసుకున్నట్లయితే ఉబ్బసం లాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ వేప కాయలను సేవించడం వలన మలబద్ధక సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే వేపకాయ గింజల నుంచి తయారు చేసే నూనె వేప నూనె అంటారు.

Health Benefits of Neem plant for different diseases

Health Benefits of Neem plant for different diseases

ఈ నూనెను మోకాళ్ళ నొప్పులకి, ఎలర్జీలకి ,పుండ్ల పైన ఇలా మసాజ్ చేసినట్లయితే వీటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా ఈ వేప నూనెను ప్రతిరోజు తలకు పెట్టుకున్నట్టయితే జుట్టు రాలే సమస్యలు, చుండ్రు, పేల సమస్యలు తగ్గిపోతాయి. అలాగే వేప ఆకులు మెంతులు కలిపి నూరి దాని నుంచి తీసిన రసాన్ని తీసుకోవడం వలన కామెర్లు తగ్గుతాయి. అదేవిధంగా వేపాకులను తీసుకొని నీటిలో మరగబెట్టి వాటితో తలస్నానం చేసినట్లయితే చర్మ వ్యాధులు, అలాగే తలనొప్పి తగ్గుతుంది వేపాకులు ఒక గ్లాసు నీటిలో నానబెట్టి తర్వాత మరగబెట్టి వాటిని చల్లార్చి నిత్యము రెండు పుట్ల సేవించినట్లయితే విష జ్వరాలు, జలుబులు లాంటివి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ మొక్కలో. ఈ విధంగా వీటిని వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది