Health Benefits : వర్షాకాలంలో వచ్చే కొన్ని వ్యాధులకు ఈ పండ్లును తీసుకోవడం వలన ఎలాంటి వ్యాధులకుకైన చెక్ పెట్టవచ్చు…
Health Benefits : వర్షాకాలంలో మనము ఎన్నో వ్యాధుల బారిన పడుతూ ఉంటాము ఈ వర్షాలు పడినప్పుడు ఆ వర్షపు నీరు కొన్ని చోట్ల ఆగడం వలన దానిలో కొన్ని రకాల దోమలు తయారవుతూ ఉంటాయి ఆ దోమలు మనకు ఎన్నో రోగాలు రావడానికి కారణమవుతుంటాయి. జలుబులు జ్వరాలు మలేరియా జ్వరం అలర్జీలు ఇలా ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి రోగాల నుంచి తప్పించుకోవాలంటే ఈ ఆల్ బుకరా పండు తీసుకోవడం వల్ల ఈ వ్యాధుల బారి నుండి తప్పించుకోవచ్చు. ఈ పండులో చాలా పోషకాలు ఉంటాయి దీనిలో ఖనిజ లవణాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి.
ఈ ఆల్ బుకరా పండు తీసుకోవడం వలన మన శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. దీనిని మన ప్రపంచంలో చాలా మంది ఎక్కువగా ఈ పండ్లను డ్రై ఫ్రూట్స్ లాగా తీసుకుంటూ ఉంటారు. దీనిలో మంచి పోషక గుణాలు ఉన్నాయి. ఈ పండు అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. ఈ పండు రుచి పుల్లగా ఉంటుంది దీనిని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. దీని వలన ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాం. ఈ ఆల్ బుకరా పండు లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఈ పండు రోజు తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

Health Benefits of plum must eat plum or aloo bukhara in monsoon
అలాగే మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇంకా చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి. మన చర్మం పై వచ్చే అలర్జీలు అలాగే మచ్చలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఈ పండు తినడం వలన మన శరీరంలో ఎముకల దృఢంగా ఉంటాయి ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ ఆల్ ఆల్ బుకరా పండును తీసుకోవడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వలన శరీరంలోని క్యాన్సర్ కణాలను ఎదుగుదలను ఆగిపోయేలా చేస్తుంది. ఇలాంటి పండు మనం రోజు ఆహారంలో చేర్చుకుందాం ఆరోగ్యంగా ఉందాం..