Health Benefits : వేడి పాలు మంచివా… పచ్చిపాలు మంచివా… ఏవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి అంటే.?

Authored By aruna | The Telugu News | Published on: August 28, 2022, 7:30 am

Health Benefits : పాలు అంటే సంపూర్ణ ఆహారం. ఈ పాలలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పాల నుండి ఎన్నో రకాల న్యూట్రియంట్లు కూడా పొందవచ్చు. అందుకే ఈ సంపూర్ణమైన పాలను ఆరోగ్యంగా ఉండడం కోసం నిత్యము తీసుకోమని చెప్తూ ఉంటారు. అయితే పచ్చిపాలు మంచివా.. వేడిపాలు మంచివా.. ఏవి ఆరోగ్యానికి మేలు చేస్తాయో అనేది వేతెలుసుకుందాం. కొందరు మరిగించిన పాలుని తాగుతూ ఉంటారు ఇంకొందరు పచ్చి పాలని తాగుతూ ఉంటారు. అయితే వీటిలో ఆరోగ్యానికి ఏ పాలు మంచివి అనేవి అనుమానాలు వస్తూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి వైద్య నిపుణులు ఏమని తెలియజేస్తున్నారంటే పచ్చిపాలు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని చెప్తున్నారు.

అమెరికా ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆహారం అండ్డ్ డ్రగ్స్ అడ్మినేషన్స్ వారి ప్రకారం పచ్చిపాలలో ఆరోగ్యానికి హానిచేసి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందట. సాల్మో నెల్ల, లిస్ట్రియా, ఈకోలి, లాంటి బ్యాక్టీరియా పచ్చిపాలలో ఉంటుంది. అందువలన పచ్చిపాలు తీసుకోవడం వలన ఒక్కొక్క సమయంలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈజీగా జీర్ణం అయ్యేందుకు : పచ్చి పాలు తీసుకోవడం వలన దాన్లో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అలాగే డిహైడ్రేషన్ డయేరియా లాంటి ఇబ్బందులు చుట్టుముడుతాయి. శరీరంలో యాసిడ్ల లెవెల్స్ కూడా అధికమైతాయి. పాలు పితికేటప్పుడు ఆ జంతువుల పొదుగు కలుషితమై ఉండవచ్చు.

Health Benefits Of Raw Milk and Burn Milk In Telugu

Health Benefits Of Raw Milk and Burn Milk In Telugu

కాబట్టి పాలు తీసే మనుషులు, పరిసరాలు, కలుషితమై ఉంటాయి. అ పాలు డైరెక్టుగా త్రాగడం వలన ఆ చెడు బ్యాక్టీరియా అంత శరీరంలోకి వెళ్తుంది. ఈ పాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు అంటున్నారు వైద్య నిపుణులు. కాబట్టి పాలను బాగా మరిగించి తర్వాత తీసుకోవడం వలన దాన్లో చెడు బ్యాక్టీరియా నశిస్తాయి. అలాగే శీతాకాలంలో, వర్షాకాలంలో రాత్రి సమయంలో వేడివేడి పాలు తీసుకోవడం వలన శరీరం వేడిగా అవుతుంది. అలాగే నిద్ర కూడా సులభంగా పడుతుంది. వేడి పాలలో విటమిన్ డి కాలుష్యం పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అలాగే వేడి పాలను ఎలాంటి టైం లో తీసుకున్న కూడా సులభంగా డైజేషన్ అవుతాయి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp