Rosemary Plant : ఈ మొక్కలో ఉన్నఆరోగ్య ప్రయోజనాలు తెలుసా… వాసనతో వ్యాధులన్నీ పరార్…!
ప్రధానాంశాలు:
Rosemary Plant : ఈ మొక్కలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా... వాసనతో వ్యాధులన్నీ పరార్...!
Rosemary Plant : రోజ్మెరీ అనేది ఒక ఆయుర్వేద ఔషధం. దీనిని ఎన్నో రకాల మెడిసిన్స్ తయారు చేసేందుకు ఎక్కువగా వాడుతారు. ఈరోజ్మెరీ కొమ్మలు మరియు ఆకులు మరియు పొడి, విత్తనాలు మార్కెట్లో మరియు ఆయుర్వేద దుకాణాలలో ఎక్కువగా దొరుకుతాయి. అయితే ఈ రోజ్మెరీ ఆకులను తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఈ కాలంలో ఎంతో మంది డయాబెటిస్ మరియు బలబద్ధకం మరియు జుట్టు సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ రోజ్మెరీ ఆకులను తీసుకున్నట్లయితే ఈ సమస్యల నుండి ఉపసమనాన్ని కలిగిస్తుంది. ఈ రోజ్మెరీ అనేది చూడడానికి ఎంతో చిన్నగా ఉంటుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ రోజ్మెరీ ఆకులనేవి ఒక ప్రత్యేకమైన సువాసన మరియు రుచిని కలిగి ఉంటాయి. అయితే ఈ ఆకుల వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్లేవ నాయిడ్స్,డైటెర్పనెస్, ఫాలీఫెనాల్స్ ఇలా ఎన్నో ఇతర ప్రభావంతమైన గుణాలను కలిగి ఉన్నాయి.
ఈ రోజ్మెరీ ఆకుల తో తయారు చేసినటువంటి నూనెను తీసుకోవటం వలన జ్ఞాపకశక్తి అనేది ఎంతగానో పెరుగుతుంది. ఇది పరిశోధనలో కూడా తేలింది. దీనిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను మెరుగుపరచటంలో చెడు కొలస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ రోజ్మెరీ ఆకులనేవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తాయి. అలాగే అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది. దీనిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని దృఢంగా మరియు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. దీంతో మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజ్మెరీ ఆకులతో తయారు చేసిన నూనె కీళ్ల నొప్పులకు మరియు కండరాల సమస్యలకు మరియు తలనొప్పికి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

Rosemary Plant : ఈ మొక్కలో ఉన్నఆరోగ్య ప్రయోజనాలు తెలుసా… వాసనతో వ్యాధులన్నీ పరార్…!
ఈరోజ్మెరీ అనేది జుట్టు మూలలను కూడా ఎంతో బలంగా చేస్తుంది. ఈ రోజ్మెరీ ఆకులనేవి ఒక ప్రత్యేకమైన సువాసనను ఇస్తాయి. ఇది మెదడు పనితీరును కూడా ఎంతోగానో ప్రేరేపిస్తుంది. అలాగే ఆలోచించే, అర్థం చేసుకునే, గుర్తుపెట్టుకునేలా మీ సామర్థ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది.ఈరోజ్మెరీ మొక్క యొక్క ఎండిన భాగాలను ఎన్నో రకాలుగా వాడతారు. అంతేకాక ఇవి శరీరంలోని ఎన్నో రకాల నొప్పుల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ రోజ్మెరీ ఆకుల సువాసన పీల్చడం వలన ఒత్తిడి,ఆందోళన,రుగ్మతలను నియంత్రిస్తుంది. ఈ రోజ్మెరీ సువాసన అనేది కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మో స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. అయితే మీరు ఈరోజ్మెరీ ఆయిల్, ఆకులను వాడి ఆవిరి పట్టుకున్న లేకపోతే వాటిని ప్రతినిత్యం వాసన పీల్చిన కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈరోజ్మెరీని వైద్యుల సలహామే రకు మాత్రమే వాడాలి. ఈ రోజ్మెరీ ని తగిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అలాగే వీటిని అధికంగా తీసుకోవడం వలన కూడా స్కిన్ అలర్జీ, తలనొప్పి, కడుపు నొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున చాలా జాగ్రత్తగా వైద్యుల సలహామేరకు మాత్రమే వీటిని తీసుకోండి…