Wax Gourd : బూడిద గుమ్మడికాయను దిష్టికాయల చూడకండి… ప్రయోజనాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Wax Gourd : బూడిద గుమ్మడికాయను దిష్టికాయల చూడకండి… ప్రయోజనాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!

Wax Gourd : బూడిద గుమ్మడికాయను హల్వా మరియు వడియాలు చేసుకుని తినటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ కాయను ఆహారంలో భాగం చేసుకుని అసలు తినరు. కానీ ఈ బూడిద గుమ్మడికాయలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ బూడిద గుమ్మడికాయతో చేసిన వంటకాలను ప్రతినిత్యం తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. ఈ బూడిద గుమ్మడికాయతో చేసినటువంటి జ్యూస్ ను పరిగడుపున ప్రతినిత్యం […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Wax Gourd : బూడిద గుమ్మడికాయను దిష్టికాయల చూడకండి... ప్రయోజనాలు తెలిస్తే... ఆశ్చర్యపోతారు...!

Wax Gourd : బూడిద గుమ్మడికాయను హల్వా మరియు వడియాలు చేసుకుని తినటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ కాయను ఆహారంలో భాగం చేసుకుని అసలు తినరు. కానీ ఈ బూడిద గుమ్మడికాయలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ బూడిద గుమ్మడికాయతో చేసిన వంటకాలను ప్రతినిత్యం తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. ఈ బూడిద గుమ్మడికాయతో చేసినటువంటి జ్యూస్ ను పరిగడుపున ప్రతినిత్యం తీసుకున్నట్లయితే శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది చేరకుండా రక్షిస్తుంది. ఇంకా ఈ బూడిద గుమ్మడికాయ వలన కలిగే లాభాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

బూడిద గుమ్మడికాయ అనేది గ్రామాలలో ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ ఇంటి వెనకాల తీగ అల్లుకొని పసుపు పచ్చని పూలతో కాయలు కాస్తాయి. కానీ వీటిని తీసుకోకుండా మనం తేలిగ్గా తీసి పారేస్తూ తీసుకుంటాం. కనీసం వాటి వంక కూడా చూడము. అలాంటి బూడిద గుమ్మడికాయ లో మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు అధికంగా ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ బూడిద గుమ్మడికాయలో ప్రోటీన్లు, ఫైబర్, జింక్, కాల్షియం, ఐరన్ తో పాటు బి1,బి2,బి3,బి5,బి6 అధికంగా ఉన్నాయి. ఈ కాయలో 96% నీరు అనేది ఉండి డీహైడ్రేషన్ సమస్య నుండి కాపాడుతుంది. అలాగే శరీరంలో ఉన్న విష పదార్థాలను కూడా బయటకు పంపించడంలో సహాయం చేస్తుంది. ఈ గుమ్మడికాయతో చేసిన కూర తినటం ఇష్టం లేనివారు జ్యూస్ లాగా చేసుకుని ప్రతిరోజు తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో ఉన్న ఫైబర్ అనేది మన శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. అంతేకాక అధిక బరువును కూడా నియంత్రించవచ్చు. అలాగే జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే మలబద్ధకం, గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలను కూడా నయం చేయవచ్చు. ఈ కాయలో ఉన్న కాల్షియం అనేది మన ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. ఈ కాయలో ఉన్నటువంటి ఐరన్ అనేది రక్తహీనత సమస్యను కూడా నయం చేస్తుంది…

బుడిద గుమ్మడికాయని తీసుకోవటం వలన పొట్టలో ఉన్న అల్సర్లు కూడా తగ్గుతాయి. కడుపులో ఉన్న మంట నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. మీరు ఈ జ్యూస్ ను గనుక ప్రతిరోజు తీసుకున్నట్లయితే చర్మం అనేది ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే వైరస్లు మరియు బ్యాక్టీరియాల నుండి కూడా రక్షిస్తుంది. అయితే ఈ జ్యూస్ లో ఎక్కువగా ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడతాయి. అంతేకాక ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలతో బాధపడేవారు ఈ జ్యూస్ ను ప్రతిరోజు తీసుకోవటం వలన ఒత్తిడి అనేది తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ జ్యూస్ ను తీసుకోవటం వలన అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారికి మంచి ఫలితం ఉంటుంది. ప్రతినిత్యం రాత్రి పడుకునే టైంలో ఈ జ్యూస్ లో కొద్దిగా తేనె కలుపుకొని తీసుకున్నట్లయితే మంచి నిద్ర కూడా పడుతుంది. అయితే ఈ జ్యూస్ ను ప్రతినిత్యం మూడు గ్లాసులు తీసుకోవటం వలన మూత్రపిండంలో రాళ్లు మరియు మూత్రపిండాల సమస్యలు కూడా తగ్గుతాయి.

Wax Gourd బూడిద గుమ్మడికాయను దిష్టికాయల చూడకండి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Wax Gourd : బూడిద గుమ్మడికాయను దిష్టికాయల చూడకండి… ప్రయోజనాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!

అయితే ఈ బుడిద గుమ్మడికాయలో నీటి శాతం అనేది ఎంతో అధికంగా ఉంటుంది. అంతేకాక దీనిలో కొవ్వు అనేది చాలా తక్కువగా ఉండటం వలన బరువు తగ్గాలి అనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బూడిద గుమ్మడికాయ ప్రేగు కదలికలను తగ్గించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే జీర్ణక్రియను కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. ఈ బూడిద గుమ్మడికాయ సౌందర్య పరంగా ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటారు. దీనిని చర్మ నిగారింపకు, జుట్టు కోసం, వెంట్రుకలు అనేవి ఒత్తుగా పెరగడానికి, చుండ్రును తగ్గించడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది