Health Benefits : తోట కూర వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే చాలన్నా తింటూనే ఉంటారు
Health Benefits : ఆకుకూరలు ఇవి మన శరీరానికి అతి ముఖ్యమైనవని కావున వీటిని తీసుకోవడం చాలా మంచిదని చాలా మంది వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ మనలో చాలా మంది ఆకుకూరలు తినేందుకు ఎక్కువగా ఇష్టపడరు. అటువంటి వారు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోరు. కానీ ఈ ఆకుకూరలు తీసుకోవడం చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరల్లో ఒకటి తోటకూర. మన దక్షిణ భారతదేశంలో తోటకూరను చాలా మంది తింటూ ఉంటారు. సాధారణంగా పప్పుతో పాటుగా తోట కూరను వేసి వండుకుంటూ ఉంటారు. ఇలా తోట కూరకు చాలా ప్రాధాన్యతనిస్తారు.
ఇందులో ఉండే ఖనిజలవణాల గురించి తెలిస్తే వామ్మో అని నోరు తెరుస్తారు. ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో. ఇక తోట కూర గురించి ఒక్కొక్క ఉపయోగం తెలుసుకుంటే..ఈ తోటకూరలో క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజలవణాలు పళ్లు మరియు ఎముకలను చాలా దృఢంగా ఉంచుతుంది. ఈ ఖనిజ లవణాల వలన మన శరీరానికి అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే ఐరన్ ఎర్రరక్తకణాలను చాలా స్ట్రాంగ్ గా మారుస్తుంది. ఇక మెగ్నీషియం విషయానికి వస్తే ఇది నరాలకు బలాన్నిస్తుంది.
ఇక ఇందులో విటమిన్లు చాలా పుష్కలంగా ఉంటాయి. వీటి వలన మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి పూట భోజనం చేసేటపుడు తోట కూరతో తినడం వలన ప్రశాంతమైన నిద్ర వస్తుంది. కావున రాత్రి పూటకి తోటకూరని ఎక్కువగా ట్రై చేయండి. ఎవరికైతే శరీరంలో అధిక వేడి ఉండి బాధపడతారో వారు ఈ తోట కూరను రెగ్యులర్ గా తినడం వలన వారికి వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వారి శరీరం వెంటనే చల్లబడుతుంది. ఇది ఇమ్యూనిటీ సిస్టంను బలంగా మారుస్తుంది. ఎక్కడైనా ఎముకలు విరిగితే తోట కూరతో కట్టు కడుతూ ఉంటారు. ఈ పద్ధతి ఎక్కువగా మనకు పల్లెటూళ్లలో కనిపిస్తూ ఉంటుంది.