Health Benefits : ఈ ఒక్క పండు చాలు.. అధిక బ‌రువు, డ‌యాబెటిస్ మ‌టుమాయం.. ఇక అస్స‌లు వ‌ద‌ల‌కండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఈ ఒక్క పండు చాలు.. అధిక బ‌రువు, డ‌యాబెటిస్ మ‌టుమాయం.. ఇక అస్స‌లు వ‌ద‌ల‌కండి

 Authored By mallesh | The Telugu News | Updated on :10 April 2022,5:00 pm

Health Benefits : ప్ర‌స్తుత జీవన శైలిలో మార్పుల‌ కారణంగా మన శరీరం అనేక వ్యాధులకు గుర‌వుతోంది. ఈ వ్యాధులలో డయాబెటిస్ ముందుంటుంది. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు వచ్చే పరిస్థితిని డయాబెటిస్ అంటారు. ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల ఇది సంభవిస్తుంది. దీంతో డయాబెటీస్‌ ఉన్నవారు అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. వీరు బరువు తగ్గడం చాలా కష్టంతో కూడుకున్న పని. దీనికి ఏ డైట్ ని ఫాలో కావాలో చాలా మందికి తెలియ‌దు. వారికి తెలిసిన‌ది ఫాలో అయిపోతుంటారు. బ‌రువు త‌గ్గించుకోవ‌డానికి డిన్న‌ర్ టైంలో చాపాతీలు, పుల్క‌లు తిని స‌రిపెట్టుకుంటారు.

కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల డయాబెటీస్‌ పేషెంట్లు బరువు పెరుగుతారు. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారి శరీరం ఇన్సులిన్ చర్యను నిరోధిస్తుంది. తద్వారా ఇన్సులిన్ రక్తం నుంచి గ్లూకోజ్‌ను తొలగించడంలో అంతగా ప్రభావం చూపదు. అందువల్ల కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలు మరింతగా పెంచుతాయి. ఈ కారణంగా డయాబెటిక్ రోగులకు బరువు తగ్గడం కష్టమవుతుంది.తాజా పండ్లు నిత్యం తీసుకోవడం వల్ల సరైన విటమిన్స్ శరీరానికి అందుతాయి.

Health benefits Overweight diabetes in Fresh fruits

Health benefits Overweight diabetes in Fresh fruits

Health Benefits : నైట్ టైం ఇవే తినండి..

పండ్లు శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అందుకే అందరూ పండ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు, డ‌యాబెటీస్ తో భాద‌ప‌డేవారు రైస్, చ‌పాతీల‌కు బ‌దులు నైట్ టైంలో ఫ్రూట్స్ తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో శక్తిని నిర్వహించడానికి పండ్లు పనిచేస్తాయి. వీటిలో ఉండే పీచు శరీర అవసరాలను తీర్చడంతోపాటు సహజసిద్ధమైన రీతిలో చక్కెరను మెయింటెయిన్ చేయడంలో సహాయపడుతుంది. నైట్ టైంలో ఫ్రూట్స్ తిన‌డం వ‌ల్ల తొంద‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. అలగే నీటి శాతం కూడా అందుతుంది. పైగా కెల‌రీలు ఉండ‌వు. అలాగే పోష‌కాల‌న్నీ పుష్క‌లంగా అందుతాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది