Health Benefits : వడదెబ్బ బారిన పడకూడదంటే.. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?
Health Benefits ; వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. అయితే ఎండలు ఉన్నాయి కదా అని మనం మన పనులను మానుకోలేం. శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగినప్పుడు వడదెబ్బ తగులుతుంది. కానీ విపరీతమైన వడదెబ్బ బారిన పడితే ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. వడదెబ్బ తగిలితే ముందుగా మైకం కమ్ముతుంది. పెదవులు, నాలుక పొడిబారిపోతాయి. తలనొప్పి, విపరీతమైన అలసట, వికారం, కండరాల తిమ్మిరి కలుగుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉంటాం. కొన్ని ఆహారాలు మనం వడదెబ్బ బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి.
ఆ ఆహారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.వేసవిలో పుష్కలంగా నీరు లభించే ఆహారాలను తీసుకోవాలి. తద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం. కొబ్బరినీరు, చెరుకురసం వంటి పానీయాలను తీసుకోవడం ద్వారా శరీరానికి సహజమైన ఎలక్ట్రోలైట్లు లభిస్తాయి. తద్వారా శరీర ఉష్ణోగ్రత కూడా బ్యాలెన్స్ తప్పదు. ఆరోగ్యంగా, పౌష్టికంగా ఉంటే డీహైడ్రేషన్ దరిచేరదు.వేసవిలో మజ్జిగ తాగితే శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంటుంది. అందుకే వేడి వాతావరణంలో మజ్జిగ తాగితే త్వరగా దాహం కాదు. మజ్జిగ దాహాన్ని దూరం చేయడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను చల్లగా ఉంచుతుంది. డీహైడ్రేషన్ ముప్పు కూడా నివారణ అవుతుంది.
వేసవిలో సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం చాలా అవసరం. వేసవిలో ఎక్కువగా లభించే పుచ్చకాయ, మామిడి పండు, తాటి ముంజెలు, కర్బూజ వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత నీరు లభిస్తుంది. మామిడిలో ఉండే పీచు పదార్థం శరీరానికి తగిన ప్రొటీన్‌లను అందిస్తుంది. వేసవిలో బొప్పాయి తినడం కూడా మంచిదే. జీర్ణక్రియకు ఇది ఎంతో సహకారం అందిస్తుంది.వేసవిలో ఎక్కువగా పెరుగు తీసుకోవాలి. ఎందుకంటే వేసవిలో పెరుగు మీ శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్‌లో ఉంచుతుంది. పెరుగు ఒక్కటే తినడం ఇష్టం లేకపోతే పెరుగుతో చేసే రెసిపీలను స్వీకరించవచ్చు. వేసవిలో పండ్ల జ్యూస్‌లను కూడా ఎక్కువగా తీసుకోవాలి.