Health Problems : నీటిని అధికంగా తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Problems : నీటిని అధికంగా తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :10 April 2023,8:00 am

Health Problems : మనిషి ఆరోగ్యంగా ఉండాలిఅంటే అలాగే శరీరంలో అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలి. అని ఆరోగ్యనిపుణులు తెలుపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ నీళ్లే అధికంగా తాగితే ఆరోగ్యం డేంజర్ లో పడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. తాగునీరు శరీరంలోని నీటి సమతుల్యను రక్షిస్తుంది. మలినాలను బయటకు పంపడంలో ఉపయోగపడుతుంది. అయితే ఇతర పదార్థాలు మాదిరిగానే నీటిని అధికంగా తీసుకోవడం కూడా శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నీటిని అవసరమైన దానికంటే ఎక్కువగా తాగడం వల్ల రక్తం పరిమాణం పెరుగుతుందని ఎక్కువ నీటిని ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు.

health problems Are you drinking too much water

health problems Are you drinking too much water

అలాగే గుండె మరింత భారం వేసి కడుపులో మంటను పెంచిందని చెప్తున్నారు. ఎక్కువ నీరు త్రాగడం వలన శరీరంలోని ఎలక్ట్రోలైట్ సామర్థ్యేత దెబ్బ తింటుంది. హైపో నాట్రేమియా ద్వారా శరీరంలోని తలనొప్పి, వికారం, బలహీనత చికాకు కండరాలు తిమ్మిరి మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకరోజులో ఎంత నీటిని తాగాలి… ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజు 9 నుండి 13 గ్లాసులు నీటిని తీసుకోవాలి. ఎక్కువ నీటిని త్రాగడం వలన కలిగే నష్టాలు; *కండరాల తిమ్మిరి: ఎక్కువగా నీరు తాగడం వలన రక్తంలో సోడియం ఎలక్ట్రోలైట్లు పల్చబడతాయి .దీని కారణంగా శరీరంలో సోడియం లెవెల్స్ తగ్గుతుంది. శరీరంలో సోడియం లెవెల్స్ తక్కువగా ఉండటం

Water : అధిక మోతాదులో నీరు తాగుతున్నారా!..అయితే జాగ్రత్త?... |Are you  drinking too much water! .. but be careful? ...

వలన కండరాలు తిమ్మిరి లాంటి సమస్యలు వస్తాయి. *అతిసారం: శరీరంలో పొటాషియం లెవెల్స్ తగ్గుతుంది. దీని వలన చాలాసేపు విరోచనాలు, చమటలు పట్టడం అలాగే తరచుగా జీర్ణం ప్రభావితం చేస్తుంది. *హైపో నాట్రేమియా: ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం లెవెల్స్ తగ్గుతుంది. గుండె కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. *తరచుగా మూత్ర విసర్జన: ఎక్కువ నీరు తాగడం వలన ఎక్కువ మూత్రం వస్తుంది. ఎందుకంటే ఎక్కువ నీళ్లు తాగినప్పుడు కిడ్నీ నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. కావున తరచుగా మూత్రవిసర్జన చేయడం వలన కిడ్నీలు మరింత ఒత్తిడికి గురవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది