Health Problems : సిగరెట్ తో పాటు టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా…!!
Health Problems : ప్రస్తుత కాలంలో స్మోక్ చేయడం అంటే ఎంతోమందికి చాలా ఇష్టం. అలాగే సిగరెట్ ను కాల్చేటప్పుడు పొగను రింగులు రింగులుగా వదులుతూ ఉంటారు. అయితే ఇదే ప్రమాదం అని అనుకుంటే స్మోక్ చేస్తూ స్టైల్ గా నిల్చోని సంతోషంగా టీ ని తాగుతూ ఉంటారు. కానీ ఇలా చేస్తే ప్రాణానికి ప్రమాదం అన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే స్మోకింగ్ ఎక్కువగా చేయడం వలన ఊపిరితిత్తులు మరియు గుండె ఆరోగ్యం కూడా తొందరగా పాడవుతుంది. అలాగే గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు.
అంతేకాక గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో కూడా సంకోచం ఏర్పడి ప్రసరణ అనేది సరిగ్గా జరగదు… సాధారణంగా మనం టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. కానీ ఒకటి లేక రెండుసార్లకు మించి ఎక్కువగా తాగితే మాత్రం ఖచ్చితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది అని నిపుణులు అంటున్నారు. అయితే సాధారణ టీ కంటే పాలటీ అసలు మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు. అయితే టీ తో పాటుగా సిగరెట్ కూడా తాగితే కచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం వరకు పెరుగుతాయి అని ప్రస్తుతం చేసిన పలు పరిశోధనలో తేలింది…
అయితే ఈ టీలో ఉండే టాక్సిన్స్ సిగరెట్ లో గనక కలిస్తే అది క్యాన్సర్ కు కారణం అవుతుంది అని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ రెండిటి కాంబినేషన్ వలన సంతాన లేమి సమస్యలు మరియు కడుపులో పుండ్ల సమస్యలు, ఊపిరితిత్తులు కుంచించడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు…