Health Problems : చలికాలంలో వాకింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Problems : చలికాలంలో వాకింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే…!!

Health Problems : చాలామంది ఉదయం వాకింగ్ కి వెళ్తూ ఉంటారు. అయితే అది మంచి అలవాటే.. అయితే చలికాలంలో ఉదయం బయటికి వస్తే చలికి వణికిపోవడం తప్పదు.. పెద్ద వయసు వాళ్ళు అయితే ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడవలసి వస్తుంది. అయినా చాలామంది వాకింగ్ చేస్తూనే ఉంటారు. కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడం అనేది జీవితంలో ఒక భాగం అయిపోతుంది. ప్రస్తుతం వాతావరణం లో కొన్ని మార్పులు చోటు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :14 January 2023,7:40 am

Health Problems : చాలామంది ఉదయం వాకింగ్ కి వెళ్తూ ఉంటారు. అయితే అది మంచి అలవాటే.. అయితే చలికాలంలో ఉదయం బయటికి వస్తే చలికి వణికిపోవడం తప్పదు.. పెద్ద వయసు వాళ్ళు అయితే ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడవలసి వస్తుంది. అయినా చాలామంది వాకింగ్ చేస్తూనే ఉంటారు. కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడం అనేది జీవితంలో ఒక భాగం అయిపోతుంది. ప్రస్తుతం వాతావరణం లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం ఎంతో చలిగా ఉంటుంది. కావున వాకింగ్ కోసం ఉదయం వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే.. ముందుగా చలికాలంలో వాకింగ్ చేసేవాళ్లు వేసుకునే దుస్తుల్లో మార్పులు చేసుకోవాలి.

చలికాలంలో బయటికి వెళ్లి రన్నింగ్, వాకింగ్ కొన్ని రకాల వ్యాయామలు చేసేవాళ్ళు అలాగే క్రీడల కోసం ప్రాక్టీస్ చేసేవాళ్ళు మార్నింగ్ వాక్ కి వెళ్లి ఎక్సర్సైజులు చేసేవాళ్ళు, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చలిలో బయటికి వెళ్లేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి వాతావరణం వలన చర్మం పగలడం, జలుబులు లాంటి సహజమైన అనారోగ్య సమస్యల నుండి మొదలవుతాయి.  తర్వాత శ్వాస కోసం సమస్యలు, నిమోనియా డిప్రెషన్ గుండెపోటు లాంటివి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ చలికాలంలో గాలిలో అయితే త్వరగా తగ్గవు కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. చలికాలంలో వాకింగ్ కి వెళ్లేవాళ్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం…

Health Problems of Walking in winter

Health Problems of Walking in winter

అవసరమైన విశ్రాంతి : ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు సరిగా నిద్ర పోయారా.. మీ శరీరానికి తగినంత విశ్రాంతి లభించిందా.. అనేది మీరు గమనించుకోవాలి. సరైన విశ్రాంతి లేక కొండ అభ్యాసాలు చేస్తే అస్తవ్యస్తకు గురవుతూ ఉంటారు. అస్తమా లేదా కొన్ని శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతుంటే సమయానికి మందులు తీసుకోవాలి. వామప్ ముఖ్యం ; ఏదైనా వ్యాయామం మొదలుపెట్టేటప్పుడు వామప్ చేయడం చాలా ముఖ్యం. ఈ వామప్ ప్రధాన పాత్రను పోషిస్తుంది. సిరియా అంతర్గత ఉష్ణోగ్రతను పెంచి మీ ముఖ్య కీళ్లలో చలనశీలతను కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా కండరాలను సక్రీయం చేసే సౌకర్యంగా శరీరాన్ని కదిలించగలిగే సిబిలిటీని అందిస్తుంది.

శరీరం తగినంత గా వేడెక్కించడం వలన అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే చలిలో ఇది చాలా ప్రధానమైనది.. రెండు పొరల దుస్తులు : చలికాలంలో పొట్టిగా ఉండే బట్టలు కాకుండా నిండుగా ఉండే బట్టలు ధరించాలి. ఎగువ దిగువ శరీరాలను కప్పి ఉండేలా లోపల నుంచి ఒక లేయర్ ధరించాలి. పైనుంచి వదులుగా ఉండే లా వేసుకోవడం చాలా మంచిది. మెడ ప్రాంతాన్ని కప్పి ఉంచి మందమైనా బిన్ను బ్రేకర్ స్టైల్ జాకెట్లు దారించుకోవాలి. మీ శరీరం వేడెక్కడం మొదలుపెట్టినప్పుడు పై లేయర్ దుస్తులు తొలగించవచ్చు. అలాగే పాదాలకు సాక్షులు, చేతులకి గ్లౌజులు, చెవులని కప్పి ఉంచే దుస్తుల్ని వేసుకోవాలి. తగిన షూస్ కూడా ధరించాలి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది