Health Tips : ఈ ఆకుతో 40 లాభాలు.. అవేంటో మీరే చూడండి..
Health Tips : వావిలాకు గురించి పల్లెటూర్లలో చాలా మంది తెలుసు. ఒంటి నొప్పులు తగ్గించేందుకు కాన్పు అయిన తర్వాత వీటిని ఎక్కువగా వాడుతుంటారు. వీటిని వేడి నీటిలో చాలా సేపు మరిగించి స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బాడీ పెయిన్స్ తగ్గుతాయి. దీనిని ఆయుర్వేదం కూడా ధ్రువీకరించింది. ఇది మన దేశంలో వెచ్చని ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది. దీనిని సర్వరోగ నివారణి అని కూడా పిలుస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఇన్సులిన్ స్థాయిలో కంట్రోల్ లో ఉంటాయి. ఫలితంగా మధుమేహాన్ని నివారించవచ్చు.
ఆ ఆకు పౌడర్ చికాకును తగ్గించడలో పైల్స్ విషయంలో చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలకు సైతం ఈ ఆకులతో తయారు చేసిన నూనెను వాడుతుంటారు.వావిలాకు తో కీళ్లవాతాన్ని తగ్గించుకోవచ్చు. కఫా బ్యాలెన్స్, వేడి లక్షణాల కారణంగా దగ్గును నివారించడంలో ఇది సహాయపడుతుంది. బాడీలో పేరుకు పోయిన శ్లేష్మాన్ని సులభంగా బయటకు పంపించేందుకు సహాయపడుతుంది. దీని ద్వారా దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. వాత బ్యాలెన్సింగ్, మేధ్య లక్షణాల కారణంగా మూర్చను నివారించడంలో ఇది సహాయపడుతుంది. నరాల సడలింపులోనూ ఉపయోగపడుతుంది.
Health Tips : కళ్లీ వాతము, దగ్గు నివారణకు..
మూర్చ తర్వాతి దాడులను ఇది నివారిస్తుంది. తన నొప్పిని నివారించడంలో ఈ ఆకును ఉపయోగించుకోవచ్చు. ఎండి వావిలాకులన కాల్చాలి. దాని నుంచి వచ్చిన పొగను పీల్చాలి. దీని వల్ల తలనొప్పి తగ్గుతుంది. శ్వాస సంబంధిత వ్యాధులను సైతం నివారించడంలో ఈ ఆకులు ఉపయోగపడతాయి. వావిలాకులను పేస్టులాగా చేసి దాని రస్తాన్ని వడకట్టాలి. రోజుకు రెండు సార్లు ఒక చెంచా చొప్పున దీనిని తీసుకోవడం వల్ల శ్వాస సంబంధమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఈ టిప్స్ ట్రై చేసి చూడండి.. ఎవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.