Health Tips : చిగుళ్ల సమస్యలతో పాటు నోటి దుర్వాసనను దూరం చేసే అద్భుతమైన చిట్కాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : చిగుళ్ల సమస్యలతో పాటు నోటి దుర్వాసనను దూరం చేసే అద్భుతమైన చిట్కాలు..!

 Authored By pavan | The Telugu News | Updated on :18 April 2022,7:00 am

Health Tips : కొంత మంది ఎన్ని సార్లు పళ్లు తోముకున్నా.. నోరంతా వాసన వస్తుంటుంది. ఇది తగ్గించుకునేందుకు అనేక రకాల స్పేలు వాడుతుంటారు. ఏవేవో నోట్లో వేసుకొని తింటుంటారు. అంతే కాకుండా చిగుళ్లు రక్తస్రావం అవుతుంటే కూడా దాన్ని మీరు విస్మరిస్తుంటారా లేదా ఇద సాధారణమైనదే అని అనుకోవచ్చు. కానీ చిగుళ్ల నుంచి రక్తస్రావం ఒక అంతర్లీన ఆరోగ్య సమస్యను సూచిస్తుంది. ఇందుకు కారణం తీవ్రంగా బ్రష్ చేయడం, అడ్డదిడ్డంగా బ్రష్ చేయడం, చిగుళ్ల గాయం… వంటివి చిగుళ్ల నుండి రక్త స్రావం అవడానికి దోహదం చేస్తాయి. అందుకే కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా టూత్ బ్రష్ మార్చాలి. గట్టిగా అయిన బ్రష్ చిగుళ్ల వాపు, ఎరుపు సున్నితత్వాన్ని కల్గిస్తుంది. అయితే దీన్ని తగ్గించడానికి సరైన చికిత్స తీసుకోవాలి.

చికిత్స వైద్యుల వద్దకు వెళ్లడమే కాదు ఇంట్లో ఉండి కూడా పలు రకాల సమస్యలను తీసుకోవాలి. అయితే నోటి శుభ్రత, ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలనుకనే వాళ్లు ఈ కింది వాటిని చేస్తే… అన్ని సమస్యలు దూరం అవుతాయి.హైడ్రోజన్ పెరాక్సైడ్ తో మీ నోరు శుభ్రం చేసుకోవాలి. దీంతో పాటి, నోటి పూతలను తగ్గిస్తుంది. పొగ త్రాగే అలవాటు, జర్దా, కిల్లీల వంటివి అలవాటు ఉంటే మానేయండి. ఇవి నోటి అనారోగ్యానికి కారణం అవుతాయి. ఒత్తిడిని తగ్గించండి. శరీరంలో అధిక ఒత్తిడి కూడా గమ్ నుంచి రక్తం కావడానికి కారణం అవుతుంది. విటామిన్ సి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. దానికోసం ఉసిరికాయ సీజన్ లో దొరికినప్పుడు ఎండబెట్టి దాచుకోవచ్చు.

Health Tips amazing home remedy for bleeding gums

Health Tips amazing home remedy for bleeding gums

ఫ్రెష్ గా ఉన్నప్పుడు కూడా రోజుకొకటి తినడం చాలా మంచిది. అలాగే విటామిన్ కె తీసుకోవడం వల్ల నోటి సమస్యలను తగ్గించుకోవచ్చు. విటామిన్ కె అధికంగా ఉండే అత్యంత సాధారణ ఆహారాలు కాలేయ, కోల్లార్డ్, బ్రొకోలీ, పాలకూర, క్యాబేజీ, పాలకూర వంటి ఆకు కూరలు. వార్ఫరిన్ ను ప్రభావితం చేసే ఇతర ఆహారాల్లో మాంసం, కాలేయడం లేదా ఇతర జంతు కాలేయ ఉత్పత్తులు ఉండవచ్చు. అలాగే తక్కువ పిండి పదార్థాలు ఉండేలా ఆహారం తినండి. చిగుళ్లకు తేలికపాటి మసాజ్ చేయడం వల్ల నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. స్వీట్లు, ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు వెంటనే నోటిని పుక్కిలించండి. జామ కాయను తీసుకోవడం వల్ల కూడా చిగుళ్ల నుంచి రక్తం రావడం తగ్గించుకోవచ్చు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది