Belly Fat : ఆడవారి కన్నా మగవారికే బెల్లీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది.. కారణం ఇదా?
ప్రధానాంశాలు:
Belly Fat : ఆడవారి కన్నా మగవారికే బెల్లీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది.. కారణం ఇదా?
Belly Fat : ఒకప్పుడు ఆడ, మగ చాలా ఫిట్‌గా ఉండేవాళ్లు. కాని పరిస్థితులు మారిపోయాయి. తినే తిండి,కలుషిత ఆహారం వలన ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. పోటీ ప్రపంచంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా అధిక బరువు, స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలు మనకు తలెత్తుతునన్ఆయి. పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోతుండటం వల్ల చాలా మంది చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. నలుగురిలో అసౌకర్యంగా ఉంటుంది. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలన్నా ఇబ్బందిగా మారుతుంటుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందడం అంత సులభం కాదు. రోజుకు మనిషికి కావల్సిన 7-8 గంటల రాత్రి నిద్ర లేకపోవడం వలన కూడా బెల్లీ ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంది.
అయితేమగవారు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొంటారు. కానీ, ఆడవారు అంతగా ఎక్కువగా వర్కౌట్ చేయరు. అయినప్పటికీ ఆడవారి కన్నా మగవారికే బెల్లీ ఎక్కవగా ఉంటుంది.అందుకు ప్రధానంగా పలు కారణాలు చెప్పవచ్చు. హార్మోన్స్ సమతుల్యం వలన మగ, ఆడవారిలో కొవ్వు నిల్వలు వేర్వేరుగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఆడవారికి నడుము, పిరుదుల ప్రాంతాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుకపోవడం జరగుతుంది . ఆడవారిలో మెనోపాజ్ తర్వాత, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. తుంటి నుండి తొడలు, పొత్తికడుపు వరకూ మాత్రం తగ్గుతుంది.
Belly Fat : బెల్లీ ఫ్యాట్‌తో సమస్యలు..
అయితే మెనోపాజ్ టైమ్‌లో ఆడాళ్లు బరువు పెరుగుతారు. హార్మోన్స్ వలన మగవారికి కడుపు ప్రాంతంలో కొవ్వు పేరుకుపోతుంది. మహిళల హార్మోన్స్ కారణంగా తొడ, నడుము ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.అయితే బెల్లీ ఫ్యాట్ వలన అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఆడవారిలో జీవక్రియ మగవారి కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ హార్మోన్స్ చేంజెస్, జీవనశైలి కారణంగా వారు అధికబరువుతో బాధపడుతున్నారు.