Health Tips : గర్భధారణ సమయంలో లికోరైస్ తినవచ్చా…? తింటే ఏమవుతుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : గర్భధారణ సమయంలో లికోరైస్ తినవచ్చా…? తింటే ఏమవుతుంది…?

 Authored By aruna | The Telugu News | Updated on :29 September 2022,7:30 am

Health Tips : మహిళలు తమ సంతాన విషయంలో సురక్షితంగా మరియు జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో వైద్య సలహా లేకుండా సహజ ఆహారాన్ని తింటే కొన్ని దుష్ప్రభావాలు ఎదురవుతాయి. లికోరైస్ చెట్టు యొక్క రూట్ చాలా రుచికరమైనది. ఈ రూట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది చాతి చికాకు, శరీర దుర్వాసన, ఉబ్బసం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు నివారణకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని పుండ్లు, కాలేయ సమస్యలు, క్షయ వ్యాధి, బట్టతల, నిరాశ మరియు హెచ్ఐవి చికిత్సలో ఉపయోగిస్తారు. లికోరైస్ ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.

మానసిక సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. రుతుక్రమం, హృదయ సంబంధ వ్యాధులు, చర్మ గాయాలు, నెలసరి తిమ్మిరి, జీర్ణ సమస్యలు, బరువు తగ్గటం, మంట వంటి ఇన్ఫెక్షన్ నుండి లికోరైస్ రక్షించడానికి ఉపయోగపడుతుంది. గర్భధారణ సమయంలో లికోరైస్ తింటే కొన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లికోరైస్ అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న గర్భధారణ సమయంలో దీనిని ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే గ్లిజరిన్ వివిధ శారీరక రుగ్మతలను ఉత్పత్తి చేస్తుంది. తలనొప్పి, అధిక రక్తపోటు, అలసట, గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Health Tips Can Liquorice be eaten during pregnancy

Health Tips Can Liquorice be eaten during pregnancy

గర్భధారణ సమయంలో లికోరైస్ తీసుకుంటే గర్భస్రావం లేదా ప్రసవానికి కారణం అవుతున్నది వైద్యులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో లికోరైస్ తీసుకోవడం తల్లి ఒత్తిడి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లలకి కూడా వ్యాపిస్తుంది. దీని కారణంగా పిండం యొక్క మెదడు అభివృద్ధి ప్రభావితమవుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత వారి ప్రవర్తనలో పెద్ద మార్పు వస్తుంది. డాక్టర్ సలహా లేకుండా గర్భధారణ సమయంలో లేదా తల్లి పాలు ఇవ్వడంలో మూలికలను తీసుకోకూడదు. అది మీకే కాదు పిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది