Health Tips : పుచ్చిన గోర్లకు ఇది రాశారంటే.. ఎంత అందంగా ఉంటాయో.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : పుచ్చిన గోర్లకు ఇది రాశారంటే.. ఎంత అందంగా ఉంటాయో..

 Authored By prabhas | The Telugu News | Updated on :2 August 2022,5:00 pm

Health Tips : చాలామందికి గోర్లు పుచ్చిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటో తెలియదు కానీ బాగా పుచ్చిపోయి నొప్పి మరియు మంట తో బాధపడుతూ ఉంటారు. మరికొందరికి అయితే గోర్లు చుట్టూ ప్రక్కల భాగమంతా ఎర్రగా అయిపోయి ఉంటుంది. ఆ నొప్పి నుంచి భరించలేక చాలామంది రకరకాల మందులు వాడుతుంటారు. ఇలా వాడినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే గోర్లు పుచ్చడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొందరికి విటమిన్స్ లోపం వలన గోర్లు పుచ్చిపోతాయి. అలాగే ఇంట్లో వాడే సబ్బులు లేక సర్ఫ్ పడకపోవడం వలన కూడా గోర్లు పుచ్చిపోతాయి. పనులు చేసుకోలేక కనీసం తినడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. గోర్లు పుచ్చితే చాలా నొప్పి వస్తుంది.

అయితే గోర్లు పుచ్చడం తగ్గి అందంగా తయారవ్వాలంటే ఈ చిట్కాను తయారు చేసుకోండి. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా కొన్ని లవంగం మొగ్గలను తీసుకొని మెత్తగా దంచి పొడి లాగా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి ఒక స్పూన్ లవంగాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టి ఐదు పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. లవంగాలలో ఉండే పోషక విలువలు మొత్తం నూనె లోకి వచ్చేంతవరకు మరిగించుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూనెను కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత కాటన్ తో ఈ నూనెను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు గోర్లపై రాసుకోవాలి.

Health tips for nails

Health tips for nails

ఇలా 20 నిమిషాల పాటు ఉండనిచ్చి తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే గోర్లు పుచ్చిపోవడం తగ్గుతుంది. ఇలా చేయడం వలన పుచ్చిన గోర్ల దగ్గర నొప్పి మంట తగ్గుతాయి. ఈ నూనెను రాసుకోవడం వలన గోర్లు మొత్తం ఊడిపోయి కొత్త గోర్లు వస్తాయి. ఈ చిట్కాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం రోజుకు రెండు సార్లు చొప్పున గోళ్లు పుచ్చడం తగ్గేంతవరకు రాసుకోవాలి. అలాగే గోరుచుట్టు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఈ నూనెను అప్లై చేయడం వలన ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. గోర్లు పుచ్చిపోయి ఎన్ని టాబ్లెట్స్ వాడినా తగ్గలేదు అనుకున్న వాళ్లు ఈ నూనెను తయారు చేసుకొని రాయండి. మంచి ఫలితాన్ని పొందుతారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది