Health Tips : ఈ పండులో ఉన్న రహస్యాలు తెలిస్తే.. వెంటనే తినడం మొదలు పెడతారు…!!
Health Tips : అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో రకాల పండ్లను నిత్యం తీసుకుంటూ ఉంటారు. అయితే మనకి తెలియని పండ్లు చాలా ఉంటాయి. వాటిలో రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటి పండే రామఫలం. ఈ పండు గురించి చాలామందికి తెలియదు. కాబట్టి ఈ రామ ఫలం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హృదయ ఆకారంలో లేత ఎరుపు రంగులోని ఆకుపచ్చ రంగులో ఉండే ఈ రామఫలం సీతాఫల జాతికి చెందినది. దీనిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీని రుచి కూడా చాలా బాగుంటుంది. రామఫలం అనగానే మనకి పురాణం పురుషులకు ఇష్టమైన పండు అని గుర్తుకొస్తుంది.
కానీ రామఫలం స్వస్థలం భారతదేశం కానే కాదు.. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాలలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. మన రాష్ట్రంలో అధికంగా పండే సీతాఫలంతోనే మనకు ఎక్కువగా అనుబంధం ఉంటుంది. అయితే ఉత్తరాంధ్ర కొన్ని తెలంగాణ జిల్లాల్లో కర్ణాటక తమిళనాడు కేరళ చత్తీస్గడ్ రాష్ట్రాలలో రామ ఫలాలు అధికంగా పండిస్తూ ఉంటారు. అయితే ఈ రాంపలంలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండడం వలన హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే శరీరంలోని ఎన్నో కణాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. రక్తహీనతతో ఇబ్బంది పడే వారికి రామ ఫలం అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ రామ ఫలంలో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వలన అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ పండులో విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వల్ల రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చూస్తుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.
రామ ఫలం లో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ల శాతం అధికం. సి విటమిన్ తో పాటు బీకాంప్లెక్స్ లోని ఫైరాదిక్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. నరాల వ్యాధులు, తలనొప్పి లాంటివి రాకుండా రక్షించేందుకు ఉపయోగపడుతుంది. రామఫలం ఆకుల్ని యాంటీ అల్సర్ ట్రీట్మెంట్ కి వాడుతూ ఉంటారు.