Health Tips : ఈ జ్యూస్లలో ఒక దాన్ని తాగితే చాలు చలికాలంలో బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఈ జ్యూస్లలో ఒక దాన్ని తాగితే చాలు చలికాలంలో బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది..!

 Authored By prabhas | The Telugu News | Updated on :21 December 2022,3:00 pm

Health Tips : ప్రస్తుత కాలంలో బ్లడ్ షుగర్ వయసు తరహా లేకుండా చుట్టుముడుతూ ఉంది. ఈ సమస్య నుంచి బయట పడడానికి ఎన్నో మందులను వాడుతూ ఉంటారు. ఈ బ్లడ్ షుగర్ కు ముఖ్య కారణం అనారోగ్యమైన ఆహారం తీసుకోవడం. ఈ షుగర్ వ్యాదిగ్రస్తులు ఆహారం చాలా త్వరగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దీనిలో షుగర్ లెవెల్స్ కాస్త పెరిగిన మరుక్షణమే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటి పరిస్థితులలో ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్లు ఆహారంపై తప్పనిసరిగా శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ షుగర్ లో కొన్ని పండ్లును తీసుకోవడం మంచిదే కానీ షుగర్ కంటెంట్ అధికంగా ఉన్న వాటిని తీసుకుంటే డేంజర్ అని చెప్తున్నారు.

ఈ షుగర్ అనేది శరీరం లోపల నుండి నెమ్మదిగా నాశనం చేసే ఒక ప్రమాద వ్యాధి. మధుమేహ వ్యాదిగ్రస్తులకు షుగర్ లెవెల్స్ అనేవి చాలా ప్రధానం. బ్లడ్ లో షుగర్ నియంత్రణ లేని మూలంగా ఈ వ్యాధి సంభవిస్తుంది. కావున రక్తంలో షుగర్ను కంట్రోల్లో ఉంచి ఈ ఐదు జ్యూస్ ల గురించి ఇప్పుడు మనం చూద్దాం… క్యాబేజీ, ఆపిల్ జ్యూస్ : క్యాబేజీలో యాంటీ ఐ సిమిక్ అండ్ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అలాగే దీనిలో ఉండే విటమిన్ సి ఇలాంటి విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. దానివల్ల క్యాబేజీ ఆపిల్ జ్యూస్ తీసుకోవడం వలన మంచి ఉపయోగాలు ఉంటాయి. క్యారెట్ జ్యూస్ : సహజంగా ప్రతి ఒక్కరూ శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగాలి. క్యారెట్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మంచి చేస్తూ ఉంటుంది. క్యారెట్ జ్యూస్ లో షుగర్ తక్కువగా ఉంటుంది. అందుకే ఈ షుగర్ వ్యాదిగ్రస్తులు దీన్ని తీసుకోవచ్చు..

Health Tips in Cabbage And apple juice

Health Tips in Cabbage And apple juice

దోసకాయ జ్యూస్ : ఈ దోసకాయ జ్యూస్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. షుగర్ పేషెంట్లు దోసకాయ జ్యూస్ తాగితే దాని వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. దీనికోసం మధుమేహం వ్యాదిగ్రస్తులు దోసకాయ తప్పనిసరిగా తీసుకోవాలి. దోసకాయ చర్మాన్ని కూడా ఎన్నో విధాలుగా మెరుగుపరుస్తుంది. దానికి ప్రతి ఒక్కరు వారానికి ఒకటి లేదా రెండుసార్లు దోసకాయ తీసుకోవాలి.

టమోటా జ్యూస్ : టమోటాలు తక్కువ గ్లైసేమిక్ సూచనలకి కలిగి ఉంటాయి. అలాగే క్యాలరీలు కూడా తక్కువ మోతలో ఉంటాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్లు టమోటో జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. దీని వలన శరీరానికి విటమిన్లు పొటాషియం లాంటి పోషకాలు పొందవచ్చు..

బ్రోకలీ జ్యూస్ : బ్రోకలీ లో అనేక ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. బ్రోకలీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్ ని తీసుకోవడం వలన షుగర్ని కంట్రోల్ లో ఉంచడానికి ఉపయోగపడే ఫైబరు తగిన మోతాదులో ఉంటుంది. దీంతో పాటు బ్రోకలీ జ్యూస్ తీసుకోవడం వలన డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంటుంది. ఈ జ్యూస్ షుగర్ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఔషధంలా పనిచేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది