Health Tips : బరువు తగ్గించడంలో భేష్ తమలపాకు.. ఇలా చేస్తే కేవలం కొన్ని రోజుల్లోనే మీరు అనుకున్న ఫలితం..
Health Tips : అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. అందుకే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ, కొంతమందికి ఆ సమయం కూడా ఉండదు. బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకుంటారు. ఆహారం ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు పాటిస్తే బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. అయితే మన ఇంట్లో తయారు చేసుకునే ఈపదార్థం తీసుకుంటే బరువు తగ్గించుకోవచ్చు.తమలపాకులు మన సంస్కృతిలో భాగం. పూజ నుంచి పెళ్లి వరకూ తమలపాకు తప్పనిసరి. తాంబూలం వివాహంలో ఓ ముఖ్య పదార్థం.
అయితే తమలపాకు ఆహార ప్రయోజనాలు కూడా ఎక్కువే. చిన్న గాయాలూ, వాపు, నొప్పి – వీటి మీద తమలపాకుని ఉంచితే సమస్య తగ్గుతుంది. తమలపాకుని నమిలి తిన్నా ప్రయోజనం ఉంటుంది. అరుగుదలకు తమలపాకు బాగా సహకరిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్ వల్ల వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్ధకానికి విరుగుడుగా పనిచేస్తుంది. అయితే ఇవే కాకుండా అధిక వరువును తగ్గించడానికి దివ్య ఔషదంలా పనిచేస్తోంది.తమలపాకులు కడుపు ఉబ్బరం లక్షణాలు, జీర్ణక్రియ చికిత్సలో సహాయపడతాయి. ఎలాంటి కసరత్తులు చేయకుండా కొవ్వుని తగ్గించవచ్చు. తమలపాకులను శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. తర్వాత ఆరిన తమలపాకులను లైట్ గా పొడి చేసుకోవాలి.

Health Tips in Weight Loss betel leaf
Health Tips : కొవ్వును తగ్గించే దివ్య ఔషదం..
ఈ పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఒక బౌల్ లో గ్లాస్ వాటర్ తీసుకుని ఒక స్పూన్ పొడి వేసి ఒక కలర్ వచ్చేవరకు మరిగించాలి. తర్వాత ఫిల్టర్ చేసి కొంచెం తేనే ఆడ్ చేసి తాగాలి. తమలపాకులు శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.తమలపాలకులను ఎక్కువగా ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో డయాబెటీస్ ను అదుపులోకి తెస్తుంది. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది. ఈ ఆకులను నమలడం వలన నోటి క్యన్సర్ ను దరిచేరకుండా చేస్తుంది. పది నుంచి పన్నెండు ఆకులను ఉడికించి కొంచెం తేనె కలిపి ప్రతిరోజు తాగాలి. అలాగే గాయాలపై తమలపాకుల పేస్టును పూయడం వల్ల తొందరగా నయం చేయవచ్చు.