Health Tips : పోషకాలు మెండుగా.. ఆరోగ్యం దండిగా.. ఎలా ఉంచుకోవాలో తెలుసుకోండిలా!
Health Tips : ఖుబానికా మీటా చాలా రుచికరమైన తీపి పదార్థం. అంతే కాదు ఖుబానికా ఎన్నో సంవత్సరాల క్రితం నుండి వారసత్వంగా వస్తున్న తీపి వంటకం. ఇందులో ఉపయోగించే ఆఫ్రికాట్లు గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఖుబానికా గురించి తెలుసుకున్నారంటే.. ఆఫ్రికాట్లు ఫారికితే అసలు వదలరు. ఆఫ్రికాట్లు విటమిన్-ఏ తో నిండి ఉంటాయి. దీనిని రెటినాల్ అని కూడా పిలుస్తారు. ఇది కొవ్వులో కరిగే విటమిన్. కంటి ఆరోగ్యాన్ని మరియు చూపును మెరుగు పరచడంలో విటమిన్-ఏ ఎంతో తోడ్పడుతుంది. అంతే కాదు విటమిన్-ఏ రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. రెటినాల్ మరియు బీటా కెరోటిన్ నియోవాస్కులర్ ఏఆర్ఎండీ అని పిలిచే తీవ్రమైన కంటి సంబంధిత జబ్బు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
ఎండిన లేదా తాజాగా ఉన్న ఆఫ్రికాట్లను తింటే వాటి నుండి పైబర్ అధికంగా పొందవచ్చు. ముఖ్యమైన పోషకాలు సులభంగా గ్రహించబడటంలో తోడ్పడుతుంది. అలాగే ఆఫ్రికాట్లు కొవ్వు ఆమ్లాలను వేగంగా విచ్ఛిన్నం చేస్తాయి. అంటే జీర్ణక్రియ సరైన క్రమంలో ఉంటుంది. అంతే కాదు, క్రమం తప్పకుండా పేగులను శుభ్రపరచడం ద్వారా జీర్ణశయాంతర సమస్యల నుండి ఇది రక్షిస్తుంది. ఆఫ్రికాట్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కంటెంట్ ను తగ్గించడానికి ఈ పండ్లు ఎంతో సాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మరియు గుండె రక్షించడానికి ఆఫ్రికాట్లు ఎంతో సాయపడతాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
వీటిలోని పొటాషియం కంటెంట్ మన వ్యవస్థలోని ఎలక్ట్రోలైట్ స్థాయులను సమతుల్యం చేస్తుంది. గుండె కండరాలను క్రమంగా ఉంచుతుంది. ప్రతి రోజూ ఒకటి లేదా రెండు తాజా ఆఫ్రికాట్లు లేదా కొన్ని ఎండిన వాటిని తినడం వల్ల గొప్ప ప్రయోజనం పొందవచ్చు.పండిన ఆఫ్రికాట్లు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల కాలక్రమేణా మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను వదిలించుకోవడానికి ఇది శరీరానికి గొప్పగా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ను కూడా చంపుతాయి. ఎముకలు గట్టి పడడానికి బలంగా తయారవడానికి కాల్షియం చాలా అవసరం. అయితే ఈ ఎండిన ఆప్రికాట్లలో ఉండే కాల్షియం, పొటాషియం వల్ల ఎముకలు చాలా బలంగా తయారు అవుతాయి.