Health Tips : ఈ జ్యూస్ చేసుకుని తాగితే చాలు … పోషకాలతో పాటు ఎన్నో సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు…!
Health Tips : చాలామందికి చలికాలంలో ఎన్నో వ్యాధులు చుట్టూ ముడుతూ ఉంటాయి. ఈ సీజన్లో జలుబులు, దగ్గులు, జ్వరాలు లాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ సీజన్లో మనకి బాగా దొరికే ఉసిరి ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఉసిరి రుచికి కాకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది. ఉసిరిని ఏ విధంగా తీసుకున్న దానిలోను పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. జ్యూస్ చేసుకుని తాగిన ఒరుగులు చేసుకున్న మురబ్బా, రోటి పచ్చడి, ఊరగాయ ఇలా ఏ విధంగా తీసుకున్న మంచి ఉపయోగాలు కలుగుతాయి. దీనిలో సి విటమిన్ పుష్కలంగా ఉండే ఈ ఉసిరిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. ఆయుర్వేదంలో ఉసిరి ఉపయోగం బాగా ఉంటుంది.
ఉసిరిని డైట్ లో చేర్చుకొని తీసుకోవడం వలన దానిలోని పోషకాలు రోగనిరుగక శక్తిని మెరుగుపరుస్తాయి. ఉసిరిలో యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు యాంటీ గ్లైసమిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ కూడా బాగా ఉంటాయి. ఉసిరిలో ఉండే విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్ బీ కాంప్లెక్స్ పాస్ఫరస్ తో పాటు ఇతర విటమిన్లు మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కావున ఉసిరిని నిత్యము తీసుకునే ఆహారంలో ఒక భాగంగా మార్చుకోవాలి. మధుమేహం వ్యాధిగ్రస్తుల్ని అదుపులో ఉంచేందుకు ఈ ఉసిరి గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. క్రోమియం మధుమేహం కంట్రోల్లో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. అలాగే అధిక బరువుతో ఇబ్బంది పడే వాళ్ళకి ఉసిరి చక్కని ఉపశమనం కలిగిస్తుంది.
దీనిలో ఉండే ఫైబర్ త్వరగా ఆకలి వేయడానికి తగ్గిస్తుంది. ఇక దీంతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా కంట్రోల్లో ఉంచుతుంది. జీర్ణ సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణం అవ్వడానికి కూడా బాగా సహాయపడుతుంది. అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. ఉసిరిని ఏవిధంగా అయినా తీసుకోవచ్చు. చాలామంది ఉసిరికాయని పచ్చిగా కూడా తీసుకుంటూ ఉంటారు. మరికొందరు ఉసిరిని ఎండబెట్టి పొడి చేసుకుని వాడుతూ ఉంటారు. అయితే ఎన్నో పోషకాలు, కణజాలు కలిగి ఉన్న ఉసిరి జ్యూస్ తయారు చేసుకోవడానికి రెండు కాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి నీళ్ళు పోసి జ్యూస్ లా చేసుకుని దానిని వడకట్టుకొని కాస్త తేనె కలుపుకొని నిత్యము గ్లాసు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.