Health Tips : ఈ తీగ కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి… దీనిలో ఉన్న ఔషధ గుణాలు గురించి తెలిస్తే షాక్ అవుతారు..!1
Health Tips : ప్రకృతి మనకి ప్రసాదించిన మొక్కలలో కొన్ని రకాల మొక్కలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి.. మనం ఉండే ఆవరణలో కనిపించే ఎన్నో రకాల మొక్కలు మనకి ఎంతగానో సహాయపడేలా ఉంటాయి. వాటిలో తీగలు, వేర్లు, దుంపలు కూడా ఒక ముఖ్య భాగమే. వీటిని వినియోగించి ఆయుర్వేద వైద్యులు పూర్వికులు చికిత్సలు చేసేవాళ్లు ఇలా ఎన్నో విధాలుగా వినియోగపడి మన ఆరోగ్య ప్రయోజనాలు తిప్పతీగ ఒకటి ప్రధానమైనది. ఆయుర్వేదంలో దీని ప్రత్యేకత చాలా విశిష్టమైనది. ఎన్నో రకాల ఔషధ గుణాలు మందుల తయారీలో వినియోగించే తిప్పతీగతో ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.
తిప్పతీగలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే తిప్పతీగ దీనికి కారణం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తిప్పతీగ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం… *ఆర్థరైటిస్ : తిప్పతీగతో కీళ్ల సమస్యలు దూరం అవుతాయి. కీళ్లవాపులకు గురవడం వలన ఆర్థరైటి సమస్య వస్తూ ఉంటుంది. అయితే తిప్పతీగ కీళ్ల వాపును తగ్గిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. *రోగ నిరోధక శక్తి: శరీర రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచడంలో తిప్పతీగ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఆల్కలాయిడ్లు అనే బయో ఆక్టివ్ సమ్మేళనాలు ఉండడం
వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపితం చేయడానికి ఈ తిప్పతీగ చాలా బాగా సహాయపడుతుంది. అలాగే శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపించి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. *శ్వాస ఇబ్బందులు : తిప్పతీగతో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ తిప్పతీగలో ఉండే యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు శ్వాసకోశ ఇబ్బందులు తగ్గిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం తిప్పతీగ ఈ సమస్యల పరిష్కారంలో గొప్పగా ఉపయోగపడడమే కాక రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.. *తీవ్రరమైన జ్వరం : వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు తిప్పతీగను తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ తిప్పతీగ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దాని ఫలితంగా జ్వరం తొందరగా నయం అవుతుంది…