Health Tips : అధిక మోతాదులో వేప ఆకులను తింటే ఏమవుతుందో తెలుసా…?
Health Tips : ఆయుర్వేదంలో వేప చెట్టును సహజ ఔషధాలయంగా పరిగణిస్తారు. ఇది ఎక్కువ మన భారతదేశంలోని పెరుగుతుంది. వేప యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉండే కల్పవృక్షం. ఇది క్యాన్సర్ ను దూరంగా ఉంచడంతోపాటు అనేక వ్యాధులను నయం చేస్తుంది. వేప చెట్టు లో బెరడు మొదలుకొని ఆకుల దాకా చివరికి పూలు, పళ్ళు, విత్తనాలు, వేరులు వేప చెట్టులోని అన్ని భాగాలు అనేక రుగ్మతలను సరి చేయడంలో […]
Health Tips : ఆయుర్వేదంలో వేప చెట్టును సహజ ఔషధాలయంగా పరిగణిస్తారు. ఇది ఎక్కువ మన భారతదేశంలోని పెరుగుతుంది. వేప యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉండే కల్పవృక్షం. ఇది క్యాన్సర్ ను దూరంగా ఉంచడంతోపాటు అనేక వ్యాధులను నయం చేస్తుంది. వేప చెట్టు లో బెరడు మొదలుకొని ఆకుల దాకా చివరికి పూలు, పళ్ళు, విత్తనాలు, వేరులు వేప చెట్టులోని అన్ని భాగాలు అనేక రుగ్మతలను సరి చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. వేపాకును కడుపునొప్పి సమస్య అయినా చర్మ సంబంధిత సమస్యలైన ప్రతి చిన్న సమస్యలను వేపను వాడుతారు.
ఈ సమస్యలను దూరం చేయడంలో వేపాకులు బాగా పనిచేస్తాయి. అయితే వేప ఆకులను ఎక్కువగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వేపాకులను అధికంగా తింటే తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. వేపాకులు ఆరోగ్యానికి చాలా మేలు కలుగజేస్తాయి. కడుపులో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి కానీ వేపాకులను ఎక్కువగా తీసుకుంటే అది ఆరోగ్యానికి హాని కలుగ చేస్తుంది. రోజుకి 6 నుంచి 8 వేప ఆకులను తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికి మించి ఎక్కువగా తీసుకుంటే కొన్ని నష్టాలు కలుగుతాయి.
వేపాకులను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. వేపాకులను క్రమం తప్పకుండా నమలడం వలన చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ పరిమాణంలో వేపాకులను నమిలితే అది చక్కెర స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది. వేపాకుల రసం కళ్ళలో పడితే మంట ఎర్రగా మారుతాయి. వేపాకు రసాన్ని జుట్టుకు రాసుకునేటప్పుడు అది కళ్ళలోకి వెళ్ళకుండా చూసుకోవాలి. వేపాకులను ఎక్కువగా తినడం వలన నోటి రుచి పోతుంది. గర్భిణీ స్త్రీలు వేపాకులను తీసుకునే ముందు నిపుణుడిని సంప్రదించాలి.