Health Tips : కేవలం రెండు నిమిషాల్లో గ్యాస్ , ఎసిడిటీ సమస్యలు దూరం .. తప్పకుండా పాటించాల్సిన చిట్కా !
Health Tips : ప్రస్తుతం జీవనశైలి కారణంగా చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. వీటికి కారణం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, బయటి ఆహారాలను ఎక్కువగా తినడం ఇలా ఎన్నో కారణాల వలన పొట్టలో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తున్నాయి. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడంతో గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ సమస్యలు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం మలబద్ధకం అని చెప్పవచ్చు. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే అర లీటర్ వాటర్ తాగాలి. దీని వలన పొట్ట శుభ్రం అవుతుంది. దీంతో మలబద్ధకం సమస్య పోతుంది.
వేళ కాని వేళలో అన్నం తినడం వలన కూడా పొట్టలో గ్యాస్టిక్ ఆమ్లాలు సరిగా ఉత్పత్తి కాక తిన్నది జీర్ణం అవ్వదు. దీంతో గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. అందుకే ఆకలి వేసినప్పుడు తినడం ఉత్తమం. అలా కాకుండా ఏది పడితే అది తింటే ఆహారం పొట్టలో పులసిపోయి గ్యాస్ గా మారుతుంది. కాబట్టి ఈ గ్యాస్ సమస్యలు పోవాలంటే ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మసాలాలు, జంక్ ఫుడ్ లను అస్సలు తినకూడదు. అయితే గ్యాస్ సమస్య వచ్చినప్పుడు ఇంట్లోనే ఈ చిట్కాను చేసుకుంటే రెండు నిమిషాల్లో ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని
నీళ్లు పోసి మరిగించి కొద్దిగా చల్లారాక త్రాగాలి. దీంతో పేగులలో కదలికలు వచ్చి గ్యాస్ బయటకి వస్తుంది. అలాగే ఈ వేడినీళ్లలో ఒకటి లేదా రెండు ఏలకులు వేసి బాగా మరిగించి త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వీలు కాకపోతే ఒక యాలక్కాయను నోట్లో వేసుకొని బాగా నమిలితే ఆ రసం వలన గ్యాస్ బయటకు పోతుంది. అలాగే మరిగే నీళ్లలో కొద్దిగా వాము వేసుకొని త్రాగిన గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా ఇంట్లోనే చిట్కాలను పాటిస్తే గ్యాస్, ఎసిడిటీ సమస్యలను రెండు నిమిషాల్లో దూరం చేసుకోవచ్చు.