Fruits : రాత్రి పడుకునే ముందు ఈ పండ్లను తింటున్నారా… సమస్యలు తప్పవు జాగ్రత్త…!
Fruits : మనం ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాము. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటిని తినటానికి నిర్దిష్ట టైం ఉన్న ఎన్నో పండ్లు ఉన్నాయి. కొన్ని పండ్లను సమయనికి తినాలని లేకపోతే ఆరోగ్యానికి మేలు జరిగే బదులు హాని కలుగుతుంది అని వైద్యులు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల పండ్లను రాత్రి పూట నిద్రపోయే ముందు తీసుకోవటం హానికరం. మీరు కూడా నిద్రపోయే ముందు కొన్ని రకాల పండ్లను […]
ప్రధానాంశాలు:
Fruits : రాత్రి పడుకునే ముందు ఈ పండ్లను తింటున్నారా... సమస్యలు తప్పవు జాగ్రత్త...!
Fruits : మనం ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాము. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటిని తినటానికి నిర్దిష్ట టైం ఉన్న ఎన్నో పండ్లు ఉన్నాయి. కొన్ని పండ్లను సమయనికి తినాలని లేకపోతే ఆరోగ్యానికి మేలు జరిగే బదులు హాని కలుగుతుంది అని వైద్యులు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల పండ్లను రాత్రి పూట నిద్రపోయే ముందు తీసుకోవటం హానికరం. మీరు కూడా నిద్రపోయే ముందు కొన్ని రకాల పండ్లను తీసుకుంటున్నారా. అయితే వాటిని తినటం పూర్తిగా మానేయండి. ఆ పండ్లు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ద్రాక్ష : ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే రుచి కూడా బాగుంటుంది. కానీ రాత్రి పడుకునే ముందు ఈ ద్రాక్షను మాత్రం తినటం అసలు మంచిది కాదు. ఈ ద్రాక్షాలో సిట్రిక్ ఉంటుంది. దీని వలన గుండెల్లో మంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే టైమ్ లో ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచె సమస్యలను కూడా కలిగిస్తుంది…
Fruits పుచ్చకాయ
రాత్రి పడుకునే ముందు కూడా ఈ పుచ్చకాయల తినటం అస్సలు మంచిది కాదు. అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, రాత్రిపూట పుచ్చకాయను తీసుకోవడం వలన పదే పదే విరేచనాలను కలిగిస్తుంది. అలాగే రాత్రి వేళ నిద్రకు బంగం కలిగే అవకాశం కూడా ఉంటుంది…
Fruits నారింజ
ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కావున శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఈ ఆరెంజ్ ను కూడా రాత్రి టైంలో తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రి పడుకునే టైంలో ఆరెంజ్ తీసుకోవటం వలన అసౌకర్యానికి గురవుతారు. అదే టైంలో ఇది కడుపు నొప్పి సమస్యను కూడా కలిగిస్తుంది.
జామకాయ : జామకాయలో పీచు పదార్థం ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనివల్ల బరువు కూడా తొందరగా నియంత్రిస్తుంది. కానీ రాత్రి పడుకునే ముందు ఈ జామ పండును తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు. నిజానికి దీనిలో పీచుపదార్థం అనేది అధిక మోతాదులో ఉండటం వలన రాత్రి టైం లో జీర్ణం కావడంలో ఎంతో ఇబ్బంది ఏర్పడుతుంది. అంతేకాక కడుపు నొప్పి సమస్య కూడా వస్తుంది.
అరటిపండు : ప్రతిరోజు అరటిపండ్లు తీసుకోవడం వలన శరీరానికి కేలరీలు, కార్బోహైడ్రేట్లు అనేది ఎక్కువ గా అందుతాయి. అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, ఒక అరటి పండులో 150 క్యాలరీలు మరియు 37.5 కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. అయితే రాత్రి టైంలో అరటిపండు తీసుకోవటం వలన ఊబకాయం అనేది వస్తుంది…